తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అంగరంగ వైభవంగా హీరో వరుణ్ పెళ్లి - bollywood latest news

వరుణ్ ధావన్-నటాషా దలాల్​ల వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఆ ఫొటోల్ని సదరు నటుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో సహచర నటీనటులందరూ అతడికి శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.

varun natasha wedding
హీరో వరుణ్ పెళ్లి.. సెలబ్రిటీల శుభాకాంక్షలు

By

Published : Jan 25, 2021, 6:29 AM IST

Updated : Jan 25, 2021, 9:02 AM IST

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్​ వివాహం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. అలీబాగ్​లోని మాన్సస్ హౌస్ రిసార్ట్​లో జరిగిన ఈ వేడుకలో ప్రేయసి నటాషా దలాల్​కు మూడు ముళ్లు వేశారు. ఇరుకుటుంబాలతో పాటు సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఫొటోలను ఇన్​స్టాలో పంచుకున్నారు వరుణ్.

వీరి పెళ్లి గతేడాది మేలోనే జరగాల్సింది కానీ కొవిడ్ ప్రభావం వల్ల వాయిదా పడింది. ఇప్పుడు కొద్దిమంది సమక్షంలో జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్​ సెలబ్రిటీలు ఎవరినీ పిలవలేదు.

ఇది చదవండి:డెస్టినేషన్ వెడ్డింగ్ ఎట్ బీచ్ సిటీ.. ట్రెండ్ గురూ!

Last Updated : Jan 25, 2021, 9:02 AM IST

ABOUT THE AUTHOR

...view details