బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్ ఓ బయోపిక్‌లో నటించడానికి సిద్ధమయ్యాడు. తనతో 'బద్లాపూర్' చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. తన ధైర్య సాహసాలతో భారత ప్రభుత్వం నుంచి పరమవీర చక్ర పురస్కారం అందుకున్న సైనికాధికారి అరుణ్ ఖెతర్‌పాల్ జీవితకథతో ఈ చిత్రం తెరకెక్కనుంది.
సైనికాధికారిగా మారబోతున్న వరుణ్
బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ త్వరలోనే ఓ బయోపిక్‌లో నటించనున్నాడు. శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
varun
1971 భారత్-పాక్ యుద్ధంలో శత్రు సైనికులను చీల్చిచెండాడుతూ 21 ఏళ్లకే వీరమరణం పొందారు అరుణ్. ఆయన పాత్రలో వరుణ్ నటించనున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో ఇతర తారాగణం వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. వరుణ్ ప్రస్తుతం 'కూలీ నెం.1'లో నటిస్తున్నాడు. వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సారా అలీఖాన్ కథానాయిక. వచ్చే మేలో ఈ చిత్రం విడుదల కానుంది.
ఇవీ చూడండి.. ఫొటో వైరల్: రణ్వీర్ ఏంటా చూపు..!