బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, నీతూకపూర్ కరోనా నుంచి కోలుకుని షూటింగ్‌కు బయలుదేరారు. 'జుగ్ జుగ్ జియో' చిత్రీకరణ కోసం బయలుదేరుతుండగా.. ముంబయి విమానాశ్రయంలో కనిపించారు. వారితో పాటుగా ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తున్న నటి కియారా అడ్వాణీ కూడా ఉంది. నీతూకపూర్ కోలుకున్నప్పటికీ.. వరుణ్ ఇంకా కొవిడ్‌తో పోరాడుతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వరుణ్ కనిపించడం వల్ల అవి పుకార్లేనని తేలింది.
కోలుకున్నారు.. షూటింగ్‌కు బయలుదేరారు - చిత్రీకరణ సమయంలో కరోనా
'జుగ్ జుగ్ జియో' సినిమా చిత్రీకరణ సమయంలో కరోనా బారినపడ్డారు బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, నీతూ కపూర్. తాజాగా కోలుకున్న వారు మళ్లీ షూటింగ్‌కు పయనమయ్యారు.
రాజ్ మెహతా దర్శకత్వంలో 'జుగ్ జుగ్ జియో' తెరకెక్కుతోంది. డిసెంబర్ ప్రారంభంలో దర్శకుడు సహా.. వరుణ్ ధావన్, నీతూ కపూర్ కరోనా బారిన పడ్డారు. ఛండీగడ్‌లో చిత్రీకరణ సమయంలో వీరికి వైరస్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం వీరంతా కోలుకున్న నేపథ్యంలో షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నారు. దర్శకుడు అందుబాటులో లేకపోయినా హీరోయిన్ కియారా అడ్వాణీ, అనిల్ కపూర్‌లపై సన్నివేశాలు తెరకెక్కించడానికి నిర్మాత సిద్ధమయ్యారని సమాచారం.
ఇదీ చూడండి:కట్ చెప్పినా ఏడుస్తూనే ఉన్నా: నుస్రత్