మెగాహీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం 'వాల్మీకి'. పూజా హెగ్డే, మృణాళిని రవి కథానాయికలు. అధర్వ మురళి కీలక పాత్రలో కనిపించనున్నాడు. హరీశ్ శంకర్ దర్శకత్వం. మిక్కీ జె.మేయర్ సంగీతం. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. గద్దలకొండ గణేష్‌గా మాస్ గెటప్‌లో వరుణ్ ఆకట్టుకుంటున్నాడు.
"నాపైన పందాలేస్తే గెలుస్తరు.. నాతో పందాలేస్తే సస్తరు", "మనం బతుకుతున్నమని పది మందికి తెల్వకపోతే ఇగ బతుకుడెందుకురా", "గవాస్కర్ సిక్స్ కొట్టుడు..బప్పిలహరి పాట కొట్టుడు..నేను బొక్కలిరగ్గొట్టుడు సేమ్ టు సేమ్" అనే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.