తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వరుణ్​ తేజ్​ వాల్మీకి 'ప్రీ టీజర్​' ఇదిగో... - pre teaser

వరుణ్‌తేజ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం 'వాల్మీకి'. పూజాహెగ్డే కథానాయిక. సోమవారం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో వరుణ్​ లుక్​ యువతను ఆకట్టుకునేలా ఉంది.

వరుణ్

By

Published : Jun 25, 2019, 12:21 AM IST

హరీశ్‌ శంకర్‌, వరుణ్​ తేజ్​ కాంబినేషన్​లో వస్తోన్న'వాల్మీకి' సినిమా ప్రీ టీజర్​ సోమవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైలాగ్‌లేమీ లేకుండా చేతిలో తుపాకీ, కంటికి సుర్మా పెట్టుకొని గడ్డంతో మాస్‌ లుక్‌లో కనిపించాడు వరుణ్‌తేజ్‌. ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయిక. మిక్కీ జే మేయర్‌ సంగీతం సమకూరుస్తున్నాడు. 14రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపి ఆచంటలు నిర్మిస్తున్నారు. 18 సెకన్ల నిడివి ఉన్న ఈ ప్రచార చిత్రాన్ని అభిమానులతో పంచుకొంటూ ట్వీట్​ చేశాడు వరుణ్ ​తేజ్​.

"మీరెప్పుడూ చూడని లుక్‌లో కనిపిస్తున్నా. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా’" అని పోస్టు చేశాడు వరుణ్​ తేజ్​. దీంతో పాటు వాల్మీకి చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్‌ను కూడా నెట్టింట పంచుకున్నాడు. తమిళ నటుడు అధర్వ లుక్‌ను షేర్‌ చేసిన వరుణ్‌... తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఆయనకు స్వాగతం పలికారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తాండ’కు రీమేక్‌గా ‘వాల్మీకి’ తెరకెక్కుతోంది.

ABOUT THE AUTHOR

...view details