తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వాల్మీకి'లో మరో హీరో​ అతిథిపాత్ర - harish shankar

మెగాప్రిన్స్​ వరుణ్​తేజ్, పూజాహెగ్డే కలిసి​ నటించిన చిత్రం 'వాల్మీకి'. హరీశ్​ దర్శకుడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో టాలీవుడ్​ హీరో​ నితిన్​ అతిథిపాత్రలో కనువిందు చేయనున్నాడు.

వాల్మీకిలో లవర్​బాయ్​ అతిథిపాత్ర

By

Published : Sep 19, 2019, 4:31 PM IST

Updated : Oct 1, 2019, 5:28 AM IST

టాలీవుడ్‌ యువహీరో వరుణ్‌తేజ్‌, దర్శకుడు హరీశ్​ శంకర్​ కాంబినేషన్​లో రూపొందిన చిత్రం 'వాల్మీకి'. పూజాహెగ్డే కథానాయిక. తమిళ నటుడు అధర్వమురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో మరో టాలీవుడ్‌ కథానాయకుడు నితిన్‌ కనిపించనున్నాడు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ వరుణ్‌ తేజ్‌ ట్వీట్ చేశాడు. నితిన్​తో కలిసున్న ఫొటోను పంచుకున్నాడు.

"వాల్మీకి చిత్రంలో అతిథిపాత్రలో నటించిన మా 'భీష్మ'కు ధన్యవాదాలు. లవ్‌ యూ డార్లింగ్‌" -- వరుణ్​తేజ్​, సినీ నటుడు

వరుణ్‌ ట్వీట్‌ చేసిన తర్వాత మరో ఫొటోను షేర్‌ చేశాడు హీరో నితిన్. 'వాల్మీకి’ చిత్రంలో భాగమైనందుకు చాలా సంతోషంగా, సరదాగా ఉందని చెప్పాడు. చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పి... సెప్టెంబర్‌ 20న గత్తర్‌ లేపాలే అని ట్వీట్ చేశాడు.

వరుణ్‌,పూజా హెగ్డే ఇంతకు ముందు 'ముకుంద' చిత్రంలో నటించారు. ప్రస్తుతం జంటగా నటించిన 'వాల్మీకి' ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. తమిళ చిత్రం 'జిగర్తాండ'కు ఈ సినిమా తెలుగు రీమేక్‌.

Last Updated : Oct 1, 2019, 5:28 AM IST

ABOUT THE AUTHOR

...view details