టాలీవుడ్ యువ హీరో వరుణ్‌తేజ్ ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో కనిపించనున్న చిత్రం ‘వాల్మీకి’. ఇందులోని 'జర్రా జర్రా' అంటూ సాగే లిరికల్ పాట బుధవారం విడుదలైంది. మిక్కీ జే మేయర్ సంగీతమందించాడు. ఈ ప్రత్యేక గీతంలో తెలుగమ్మాయి డింపుల్ హయాతీ నర్తించింది.
లిరికల్ పాట: చేయి పెడితే లక్ష.. కాలు పెడితే రచ్చ - Valmiki - Jarra Jarra Telugu Lyrical video
వరుణ్‌తేజ్ నటించిన 'వాల్మీకి'లోని 'జర్రా జర్రా' అంటూ సాగే లిరికల్ పాట ఆకట్టుకుంటోంది.
వాల్మీకి ప్రత్యేక గీతం
ఇందులో అధర్వ మురళి, మృణాళిని రవి ఇతర పాత్రలు పోషించారు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించారు. సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: 'మెగాస్టార్ తమ్ముడిని కావడం దేవుడిచ్చిన వరం'
Last Updated : Sep 27, 2019, 7:54 PM IST