తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వాల్మీకి ఐటమ్​ సాంగ్​లో తెలుగు భామ - varuntej valmiki

టాలీవుడ్​ హీరో వరుణ్​ తేజ్​ హీరోగా హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'వాల్మీకి'. తమిళ సూపర్​ హిట్​ జిగర్తాండాకు రీమేక్​గా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదల తేదీ ప్రకటించిన హరీశ్​ మరో అప్​డేట్​ వదిలారు.

వాల్మీకి ఐటమ్​సాంగ్​లో తెలుగు భామ

By

Published : Jul 25, 2019, 12:09 PM IST

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్​ తేజ్​, హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న 'వాల్మీకి' సెప్టెంబర్​ 13న విడుదలకు సిద్ధమౌతోంది. ఈ చిత్రంలో హైదరాబాద్​ అమ్మాయి 'డింపుల్‌ హయాతీ' ఓ ప్రత్యేక గీతంలో నర్తించబోతోంది. 'దేవి 2' సినిమాలో ప్రభుదేవాతో కలిసి కీలక పాత్రలో కనిపించింది డింపుల్‌. 2017లో గల్ఫ్​ చిత్రంతో అరంగేట్రం చేసిన ఈ అమ్మడు... ప్రస్తుతం 'యురేకా' చిత్రంలో నటిస్తోంది.

డింపుల్‌ హయాతీ

తమిళ నటుడు అథర్వ మురళి ప్రతినాయకుడి పాత్రగా కనిపించనున్నాడు. పూజా హెగ్డే కథానాయిక. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. తమిళంలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న ‘జిగర్తాండ’కు రీమేక్‌గా రూపొందుతోందీ సినిమా. మిక్కి జే.మేయర్‌ సంగీతం అందిస్తుండగా... 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపి ఆచంట చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details