నిస్సహాయ స్థితిలో న్యాయం కోసం పోరాటం చేస్తున్న ముగ్గురు యువతులకు న్యాయవాది సత్యదేవ్ ఎలా అండగా నిలిచారనే కథతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా 'వకీల్‌సాబ్'. పవన్ కల్యాణ్, శ్రుతిహాసన్ ప్రధాన పాత్రల్లో అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. శుక్రవారం(ఏప్రిల్ 9) విడుదలైన ఈ చిత్రం.. అన్ని కేంద్రాల్లో ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా 'వకీల్‌సాబ్'ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు దర్శక నిర్మాతలు దిల్ రాజు, వేణుశ్రీరామ్ కృతజ్ఞతలు తెలిపారు.
'వకీల్‌సాబ్' సక్సెస్‌మీట్.. టపాసులతో సెలబ్రేషన్ - వకీల్‌సాబ్ న్యూస్
పవన్ 'వకీల్‌సాబ్' ప్రేక్షకాదరణ పొందుతుండటంపై దర్శక నిర్మాతలు వేణుశ్రీరామ్, దిల్‌రాజు ఆనందం వ్యక్తం చేశారు. టాపాసులు కాల్చి సందడి చేశారు.
'వకీల్‌సాబ్' సక్సెస్‌మీట్.. టపాసులతో సెలబ్రేషన్
సమాజంలో మహిళల ప్రాధాన్యతను వివరిస్తూ నిర్మించిన తమ చిత్రానికి ఘన విజయం దక్కడం ఆనందంగా ఉందని అన్నారు. తన సంస్థకు మంచి సినిమాను అందించిన దర్శకుడు వేణుశ్రీరామ్‌ను నిర్మాత దిల్‌రాజు ఘనంగా సత్కరించారు. అనంతరం చిత్ర బృందంతో కలిసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకొన్నారు.
ఇది చదవండి:సమీక్ష: పవన్ 'వకీల్‌సాబ్ 'ఎలా ఉందంటే?