పవన్‌కల్యాణ్ నటించిన 'వకీల్‌సాబ్' సినిమాలోని 'కదులు కదులు' పాట విడుదలను సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేసినట్లు తెలిపింది చిత్రబృందం. వేణు శ్రీరామ్ దర్శకుడు. బోనీకపూర్ సమర్పణలో దిల్‌రాజు నిర్మించారు. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రలు పోషించారు. ఇందులో పవన్ న్యాయవాదిగా కనిపించనున్నారు. తమన్ సంగీత దర్శకుడు. ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదల కానుందీ సినిమా.
'వకీల్‌సాబ్' సాంగ్ వాయిదా- 'జాతిరత్నాలు' డిలీటెడ్ సీన్ - jatiratnalu deleted scene
పవన్ 'వకీల్‌సాబ్' సినిమాలోని 'కదులు కదులు' పాట విడుదల వాయిదా పడింది. 'జాతిరత్నాలు' సినిమాలోని మరో డిలీటెడ్ సీన్ విడుదలై విపరీతంగా నవ్విస్తోంది.
వకీల్‌సాబ్
నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం 'జాతిరత్నాలు'. ఇటీవల ఈ చిత్రంలోని ఓ డిలీటెడ్ సీన్‌ను రిలీజ్ చేసిన చిత్రబృందం ఇప్పుడు మరో తొలగించిన సన్నివేశాన్ని విడుదల చేసింది. విపరీతంగా నవ్విస్తున్న ఈ సీన్‌ను మీరూ చూసేయండి.
ఇదీ చూడండి: అలరిస్తున్న 'జాతిరత్నాలు' డిలిటెడ్ సీన్
Last Updated : Apr 6, 2021, 4:20 PM IST