తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బుల్లితెరపైనా 'ఉప్పెన' జోరు.. టీఆర్​పీతో రికార్డు - వైష్ణవ్ తేజ్ ఉప్పెన రికార్డు టీఆర్​పీ

మెగా హీరో వైష్ణవ్ తేజ్​, కృతిశెట్టి జంటగా నటించిన 'ఉప్పెన' చిత్రం బుల్లితెరపైనా జోరు చూపించింది. టెలివిజన్​లో ప్రసారమైన మొదటిసారి 18.5 టీఆర్​పీ సాధించి రికార్డు సృష్టించింది.

Uppena g
ఉప్పెన

By

Published : Apr 29, 2021, 8:43 PM IST

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి జంటగా తెరకెక్కిన చిత్రం 'ఉప్పెన'. బుచ్చిబాబు సానా దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలై మంచి విజయం అందుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇటీవలే టీవీలో ప్రసారమైన ఈ మూవీ అక్కడా జోరు చూపించింది. టెలికాస్ట్ అయిన మొదటిసారి 18.5 టీఆర్​పీతో రికార్డు సృష్టించింది. డెబ్యూ హీరో సినిమాకు ఇంతటి వ్యూస్ దక్కడం ఇదే తొలిసారి. ఇదేరోజు ప్రసారమైన విజయ్ 'మాస్టర్' చిత్రం 4.8 టీఆర్​పీ దక్కించుకుంది.

'ఉప్పెన' చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం పెద్ద ప్లస్​. అలాగే విజయ్ సేతుపతి హీరోయిన్​ తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. అరంగేట్రం సినిమాతోనే వైష్ణవ్, కృతిశెట్టి వారి నటనతో విమర్శకుల ప్రశంసలూ అందుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details