తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నీ నవ్వు ముత్యాలహారం.. నన్ను తీరానికి లాగేటి దారం' - ఉప్పెన సాంగ్​

మెగా కుటుంబం నుంచి వస్తోన్న మరో యువ నటుడు వైష్ణవ్​ తేజ్​. సుప్రీం హీరో సాయిధరమ్​ తేజ్​ సోదరుడైన ఇతడు.. ప్రస్తుతం 'ఉప్పెన' సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి తొలిపాట​ను విడుదల చేశారు.

Uppena First song released: Nee kannu neeli samudram
'నీ నవ్వు ముత్యాలహారం.. నన్ను తీరానికి లాగేటి దారం'

By

Published : Mar 2, 2020, 6:39 PM IST

Updated : Mar 3, 2020, 4:41 AM IST

సాయిధరమ్​ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం 'ఉప్పెన'. ఈ సినిమాలోని ఫస్ట్​ సాంగ్​ను విడుదల చేసింది చిత్రబృందం. 'నీలి కన్ను.. నీలి సముద్రం' అంటూ సాగే పాటను శ్రీమణి రచించగా.. జావేద్​ అలీ ఆలపించాడు.

ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకుడు. ఇప్పటికే విడుదల చేసిన హీరోహీరోయిన్​ లుక్స్​ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ, సుకుమార్‌ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నాడు. ఏప్రిల్‌ 2న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.


ఇదీ చూడండి.. పవర్ స్టార్ వచ్చేశాడు.. అదిరిపోయిన 'వకీల్ సాబ్' ఫస్ట్​లుక్

Last Updated : Mar 3, 2020, 4:41 AM IST

ABOUT THE AUTHOR

...view details