తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Tollywood: ఈ వారం విడుదలయ్యే సినిమాలివే! - ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్​- 9

కరోనా అనంతరం ఇటీవల థియేటర్​లలో సినిమాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి. ఆగస్టు మూడో వారంలోనూ ఓటీటీలతో పోల్చితే బాక్సాఫీస్​ వద్దే పలు చిత్రాలు సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి అవేంటో ఎప్పుడు రిలీజ్​ కానున్నాయో చూద్దామా..

kanabadutaledu
కనబడుటలేదు

By

Published : Aug 16, 2021, 10:15 AM IST

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అటు థియేటర్‌లలోనూ, ఇటు ఓటీటీల్లో పలు సినిమాలు సందడి చేశాయి. అదే ఉత్సాహంతో ఈ వారం కూడా మరికొన్ని చిత్రాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, ఈసారి ఎక్కువ సినిమాలు థియేటర్‌లలో విడుదలవుతున్నాయి. మరి ఈ వారం విడుదల కానున్న సినిమాలెంటే చూసేద్దామా..

'కనబడుటలేదు' అంటున్న సునీల్‌

కనబడుటలేదు చిత్రంలో సునీల్

నటుడు సునీల్‌ కీలక పాత్రలో నటించిన క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'కనబడుటలేదు'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సునీల్‌ డిటెక్టివ్‌గా కనిపించనున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌కు ప్రేమకథ కూడా జోడించి దర్శకుడు బాలరాజు ఈ చిత్రాన్ని రూపొందించారు. మరి డిటెక్టివ్‌గా సునీల్‌ ఏ కేసును టేకప్‌ చేశాడు? దాన్ని ఎలా పరిష్కరించాడు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

నవ్వులు పంచే చోరుడు

రాజ రాజ చోర

శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో తీసిన చిత్రం 'రాజ రాజ చోర'. హసిత్‌ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చెప్పుకునే ఓ దొంగ కథను ఇందులో చూపించనున్నారు. శ్రీ విష్ణు సరసన మేఘా ఆకాశ్‌, సునయన నటించారు. రవిబాబు, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వ ప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించారు. ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్వీటీతో ఆర్‌.ఆర్‌.ఆర్‌ అంకుల్స్‌..

క్రేజీ అంకుల్స్​లో శ్రీముఖి

ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులోనే చేయాలంటుంటారు. కానీ.. కొంతమంది మాత్రం కాస్త ఆలస్యంగా మేల్కొని ఎప్పుడో చేయాల్సిన పనులు ఇంకెప్పుడో చేస్తుంటారు. ఈ 'క్రేజీ అంకుల్స్‌' పరిస్థితి కూడా అదే. ఓ అపార్టుమెంటులో ఉండే ఆర్‌, ఆర్‌, ఆర్‌ (రాజు.. రెడ్డి.. రావు) ముగ్గురూ మధ్యవయస్కులు.. తాము కుర్రతనంలో చేయలేకపోయిన చిలిపి పనులు ఇప్పుడు చేద్దామని అనుకుంటారు. ఈ క్రమంలోనే ఒక అందమైన అమ్మాయి స్వీటీ (శ్రీముఖి) వెంట పడతారు. ఈ క్రమంలో వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేదే మిగతా కథ. సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బుల్లితెర తార శ్రీముఖి ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా.. క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, మనో, భరణి సందడి చేయనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కానుంది.

ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌-9 (ఆగస్టు 19)

ఎఫ్​- 9 మూవీ

ప్రపంచవ్యాప్తంగా యాక్షన్‌ ప్రియులను అలరించే చిత్రాల్లో 'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌' సిరీస్‌ ఒకటి. ఈ ఫ్రాంఛైజీలో ఇప్పటివరకూ ఎనిమిది చిత్రాలు విడుదలై సందడి చేయగా, 9వ చిత్రం 'ఎఫ్‌9' త్వరలో భారతీయ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా విడుదలైన ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. విన్‌ డీజిల్‌, మిచెల్లీ రోడ్రిగోజ్‌, టైర్సీ గిబ్సన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆగస్టు 19న ఇంగ్లీష్‌, హిందీతో పాటు, ఇతర భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. జస్టిన్‌ లిన్‌ దర్శకత్వం వహించారు.

'బజార్‌ రౌడీ' అంటున్న సంపూ

బజార్​ రౌడీగా సంపూర్ణేష్​

'హృదయకాలేయం', 'కొబ్బరిమట్ట' చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేశారు నటుడు సంపూర్ణేశ్‌ బాబు. తనదైన శైలిలో భారీ డైలాగులు చెప్పి విశేషంగా ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన 'బజార్‌ రౌడీ'గా మారారు. సంపూర్ణేశ్‌ హీరోగా వసంత నాగేశ్వరరావు తెరకెక్కించిన చిత్రమిది. మహేశ్వరి వద్ది నాయిక. ఆగస్టు 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్‌ తరహా సన్నివేశాలతో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కె.ఎస్‌. క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది.

తరగతి గది దాటి

ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

ఆహా

తరగతి గది దాటి (ఆగస్టు 20)

అమెజాన్‌ ప్రైమ్‌

ఇవాన్‌ అల్మైటీ (ఆగస్టు 16)

ద స్కెలిటన్‌ ట్విన్స్‌ (ఆగస్టు 17)

నైన్‌ పర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌ (ఆగస్టు 18)

అన్నెట్టే (ఆగస్టు 20)

కిల్లర్‌ ఎమాంగ్‌ అజ్‌ (ఆగస్టు 20)

హోమ్‌ (ఆగస్టు 19)

నెట్‌ఫ్లిక్స్‌

కామెడీ ప్రీమియం లీగ్‌ కామెడీ షో (ఆగస్టు 20)

స్వీట్‌గర్ల్‌ (ఆగస్టు 21)

జీ 5

200 హల్లా హో (ఆగస్టు 20)

ఆల్ట్‌ బాలాజీ

కార్టెల్‌ (ఆగస్టు 20)

ఇదీ చదవండి:తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ.. కోట్ల మనసుల్ని గెలిచింది!

ABOUT THE AUTHOR

...view details