తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సోషల్​ మీడియాలో ఉపాసన భావోద్వేగపు పోస్ట్​! - రామ్​ చరణ్​, ఉపాసన వివాహ వార్షికోత్సవం

టాలీవుడ్​ హీరో రామ్​చరణ్​ సతీమణి ఉపాసన సామాజిక మాధ్యామాల్లో ఓ భావోద్వేగపు పోస్ట్​ చేశారు. గడచిన 20 రోజుల నుంచి ఎన్నో చేదు వార్తలను ఎదుర్కొన్నామని తెలిపారు​. ఆ వార్తల వల్ల మానసికంగా చాలా కుంగిపోయామని పేర్కొన్నారు ఉపాసన.

Upasana Konidela Shared A Emotional Post on Social Media
సోషల్​మీడియాలో ఉపాసన భావోద్వేగపు పోస్ట్​!

By

Published : Jun 21, 2020, 6:01 AM IST

గ‌త కొన్ని రోజులుగా మ‌న‌మంతా వివిధ చేదు వార్త‌ల‌తో మాన‌సికంగా కుంగిపోయామ‌ని క‌థానాయ‌కుడు రామ్​చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న పేర్కొన్నారు. ఆమె శ‌నివారం సోష‌ల్‌మీడియాలో ఓ భావోద్వేగ‌పు పోస్ట్ చేశారు‌. త‌మ కుటుంబ స‌భ్యులు కూడా గత కొన్ని రోజులుగా వేద‌న‌లో ఉన్నార‌ని చెప్పారు.

"గ‌త 20 రోజుల నుంచి మ‌నం ఎన్నో భ‌రించాం. మా కుటుంబంలోని ముగ్గురు పెద్ద‌వాళ్లు క‌న్నుమూశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మ‌ర‌ణ‌వార్త విన్నాం. మరోవైపు కొవిడ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మ‌న దేశాన్ని కాపాడేందుకు జ‌వాన్లు త‌మ ప్రాణాల్ని త్యాగం చేశారు. వీటిని ఎదుర్కోవ‌డం అంత సుల‌భం కాదు. స‌రిగ్గా వారం క్రితం మా వివాహ ఎనిమిదో వార్షికోత్స‌వం. కానీ, ఆ ప్ర‌త్యేక రోజును జ‌రుపుకొనే ఆస‌క్తి మాలో లేదు. మూడు ర‌కాల ఆవ‌కాయ ప‌చ్చ‌ళ్లు, అన్నం, చిప్స్ మాత్ర‌మే తిన్నాం, ఇంట్లోనే టీవీ చూశాం. ఈ స‌మ‌యంలోనే జీవితానికి కావాల్సిన అతి ముఖ్య‌మైన పాఠాల్ని నేర్చుకున్నాం."

- ఉపాసన కొణిదెల, హీరో రామ్​చరణ్​ భార్య

అనంత‌రం తను‌ షేర్ చేసిన ఫొటోను ఉద్దేశిస్తూ.. అందులోని ప్ర‌తి వ‌స్తువు త‌మ‌లోని కొత్త విష‌యాన్ని తెలుపుతుంద‌ని పేర్కొన్నారు. ఫొటోలో సింహం, గుర్రం బొమ్మ‌లు, ఆవ‌కాయ‌తో క‌లిపిన అన్నం, చిప్ప్, ఫోన్‌, టీవీ రిమోట్‌ ఉన్నాయి.

రామ్​చరణ్​, ఉపాసన

గ‌ల్వాన్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన సంతోష్‌బాబుకు, మిగిలిన అమ‌ర వీరుల‌కు రామ్​చ‌ర‌ణ్ శుక్ర‌వారం నివాళుల‌ర్పించారు. కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతూ.. వీర మరణం పొందిన జవాన్లకు సెల్యూట్ చేశారు. వారి త్యాగాల్ని దేశం ఎన్న‌టికీ మ‌రువ‌ద‌ని పేర్కొన్నా‌రు.

ఇదీ చూడండి...'రెడ్​వైన్​ తాగకపోతే రాత్రి నిద్ర పట్టదు'

ABOUT THE AUTHOR

...view details