Bheemla nayak naga vamsi: సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పలు సినిమాలు తీస్తున్న నిర్మాత నాగవంశీ.. ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. 'డీజే టిల్లు' ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి! ఇప్పుడు వీటిపై స్పందించిన వంశీ.. ట్విట్టర్లో ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టారు.
"ప్రేక్షకులు అంటే మాకు ఎంతో గౌరవం. ఏ చిత్ర నిర్మాణ సంస్థకైనా వారే బలం. ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామన్న ఆనందంలో 'డీజే టిల్లు' విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు ప్రేక్షకులను ఇబ్బంది కలిగించాయన్న వార్తలు తెలిసి బాధపడ్డాను. ప్రేక్షకులను ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడటం, వారిని నా సోదరులుగా భావించడం వల్లే. అయినా వారి మనసు నొచ్చుకోవడం పట్ల క్షంతవ్యుడిని. ముందుగా చెప్పినట్లే ఎప్పటికీ ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం, వారే మా బలం" అని వంశీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.