ప్రతి ఏటా ఉగాది సందర్భంగా సినీ రంగంలో ప్రతిభ కనబర్చినవారికి అవార్డులు అందిస్తోంది శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్. 2018 పురస్కార గ్రహీతల పేర్లను ఈరోజు వెల్లడించింది.
ఉగాది పురస్కారాల్లో విజయ్ దేవరకొండ, సమంత - tollywood
21వ ఉగాది, మహిళారత్న పురస్కారాలను ప్రకటించింది శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్. ఉత్తమ నటీనటులుగా విజయ్ దేవరకొండ, సమంతను అవార్డులు వరించాయి.
ఉగాది పురస్కారాల్లో విజయ్ దేవరకొండ, సమంత
ఉత్తమ చిత్రంగా మహానటి, ఉత్తమ దర్శకుడుగా సుకుమార్, ప్రత్యేక ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, ప్రత్యేక జ్యూరీ అవార్డును రాశీఖన్నా, ఉత్తమ నూతన నటిగా రష్మిక మంధానను ఎంపిక చేశారు. విశిష్ట, మహిళారత్న, బాపూ రమణల పురస్కారాలనూ జాబితాలో ప్రకటించారు.