"మీ పెద్దోళ్లున్నారే.. మా చిన్నోళ్లకు ఏం కావాలో ఎప్పటికీ తెలుసుకోలేరు" అంటూ వైవిధ్యమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేశాడు హీరో ఉదయ్ కిరణ్. వరుసగా మూడు భారీ విజయాలు అందుకుని లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. నేడు ఉదయ్‌కిరణ్ జయంతి.
బ్యాక్‌గ్రౌండ్..
1980 జూన్ 26న హైదరాబాద్‌లో జన్మించాడు ఉదయ్ కిరణ్. సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం మోడలింగ్ మొదలుపెట్టి సినిమాలపై మక్కువతో చిత్రసీమలో అడుగుపెట్టాడు. 2014లో విషితను వివాహం చేసుకున్నాడు.
సినీ ప్రస్థానం..
ఉషాకిరణ్ మూవీస్ సంస్థ నిర్మాణంలో తేజ దర్శకత్వం వహించిన 'చిత్రం' సినిమాతో తెరంగేట్రం చేశాడు ఉదయ్. రెండో సినిమా 'నువ్వు-నేను'లో కూడా తేజ దర్శకత్వంలోనే నటించాడు. ఆ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు. అనంతరం 'మనసంతా నువ్వే' చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు. కలుసుకోవాలని, నీ స్నేహం, శ్రీరామ్ లాంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
21 ఏళ్లకే ఫిల్మ్‌ఫేర్ అవార్డు..