బుల్లితెరపై వ్యాఖ్యాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది శ్రీముఖి. ప్రేక్షకులను అలరించడం సహా తనదైన యాంకరింగ్‌తో అభిమానుల మనసులు దోచుకుంది. వెండితెరపై మాత్రం ఆమెకు అదృష్టం కలిసి రాలేదు. అడపతడపా సినిమాలు మాత్రమే చేసింది. అయితే తన సినీ ప్రయాణానికి ఎందుకు బ్రేక్ పడిందో చెప్పింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనతో అన్న మాటలు నిజమయ్యాయని పేర్కొంది.
శ్రీముఖి జీవితంలో నిజమైన త్రివిక్రమ్ మాటలు - srimukhi latest news
తన సినీ ప్రయాణానికి ఎందుకు విరామం తీసుకోవాల్సి వచ్చిందో యాంకర్ శ్రీముఖి వెల్లడించింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాటలు తన జీవితంలో నిజమయ్యాయని పేర్కొంది.
'జులాయి' సినిమా చేస్తున్నప్పుడు నాన్నగారు సినిమాలు చేయొద్దని చెప్పడం వల్ల, వాటిని మానేశానని శ్రీముఖి చెప్పింది. ఆ తర్వాత తన దృష్టంతా టీవీ షోలపైనే పెట్టానని తెలిపింది.ఆ సమయంలోనే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సలహా ఇచ్చారని పేర్కొంది. "నువ్వు ఇలాగే టీవీ షోలు చేసుకుంటూ పోతే సినిమా అవకాశాలు రావు" అని అన్నారని, చివరకు ఆయన చెప్పినట్లే జరిగిందని వెల్లడించింది.
టీవీ షోస్ చేస్తున్నప్పుడు కొన్ని చిన్న సినిమాల్లో నటించమని అడిగారని, అయితే వాటిలో తన పాత్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడమే కాకుండా ఎక్స్‌పోజింగ్, లిప్‌లాక్‌లు చేయాలని డైరెక్ట్‌గా అడగడం వల్ల ఆ అవకాశాల్ని వదులుకున్నానని చెప్పింది.