అమెరికాలో బాలీవుడ్ సినిమాలు విడుదలవడం కొత్తేం కాదు. న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో ప్రచారం చేయడమే అరుదు. ఆ ఫీట్‌ను ఫర్హాన్ అక్తర్ బీట్ చేశాడు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బిల్‌బోర్డ్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.
'అప్పుడు మొదటిసారి నేను న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌కు వెళ్లా. అక్కడ పెద్దపెద్ద బిల్‌బోర్డ్స్ చూశా. నా సినిమా ప్రచారం కూడా ఇలా చేస్తే బాగుండు అనుకున్నా. ఆ కల నిజమైంది. ఇదంతా అమెజాన్ ప్రైమ్ వీడియో చలవే' అంటూ సంతోషం వ్యక్తం చేశాడు.