సినిమా సూపర్‌హిట్. ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించింది. అక్కడితో ఆగిపోతే కిక్కేముంది. అందుకే దర్శక నిర్మాతలు దానికి సీక్వెల్ ప్రకటించారు. డబుల్ కిక్ ఇస్తామంటూ హామీ ఇచ్చారు. ఆ మాటను నిలబెడుతూ షూటింగ్‌లు కూడా చేస్తున్నారు. అవి ఎప్పుడెప్పుడు వస్తాయా అంటూ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో తెరకెక్కుతున్న అలాంటి కొన్ని సీక్వెల్‌లు థియేటర్లలోకి ఈ ఏడాదే రానున్నాయి. ఇంతకీ ఆ సినిమాలేంటి? ఏ మేరకు అంచనాలు ఉన్నాయి?
'కేజీఎఫ్ 2' కోసం ఎంతోమంది!
2018లో విడుదలైన 'కేజీఎఫ్' తొలి భాగం.. దేశవ్యాప్తంగా విడుదలై, అన్ని భాషల ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు సీక్వెల్‌ను ప్రకటించడం అందులో సంజయ్ దత్, రవీనా టండన్ లాంటి స్టార్స్ నటిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో రెండో భాగంపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇటీవల వచ్చిన టీజర్ వాటిని మరికాస్త పెంచింది. ప్రస్తుతానికి విడుదల తేదీ చెప్పకపోయినప్పటికీ, సినిమా ఈ ఏడాది థియేటర్లలోకి రావడం మాత్రం కచ్చితమని తెలుస్తోంది.
షూటింగ్‌ల్లో 'భారతీయుడు'-'ఎఫ్ 2' సీక్వెల్స్
దాదాపు 25 ఏళ్ల తర్వాత 'భారతీయుడు'గా కమల్‌హాసన్ మళ్లీ నటిస్తున్నారు. సీక్వెల్ షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ సెట్లో ప్రమాదం, కొవిడ్ ప్రభావం వల్ల దానికి అంతరాయం ఏర్పడింది. ఇటీవల షూటింగ్‌ల కోసం నిబంధనలు సడలించిన నేపథ్యంలో శరవేగంగా చిత్రీకరణ జరిపి, ఎలాగైనా సరే థియేటర్లలో త్వరలో తీసుకురావాలని భావిస్తున్నారు.
'ఎఫ్ 2' సీక్వెల్ షూటింగ్ ఇప్పటికే సూపర్‌ఫాస్ట్‌గా జరుగుతోంది. విక్టరీ వెంకటేశ్, వరుణ్‌తేజ్‌తోపాటు సీక్వెల్లో సునీల్ నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. తొలి భాగంగా భార్తభర్తల మధ్య గొడవల్ని హాస్యభరితంగా చూపించగా, సీక్వెల్ డబ్బు వల్ల భార్యభర్తల మధ్య కలిగే ఇబ్బందుల్ని చూపించనున్నారు. ఈ ఏడాది దసరాకు సినిమా వచ్చే అవకాశముంది.
టాలీవుడ్లో రానున్న సీక్వెల్స్
మరో నాలుగు సీక్వెల్స్ కూడా
పైన చెప్పిన వాటితో పాటే మరో నాలుగు సీక్వెల్స్.. ప్రేక్షకుల్ని ఈ ఏడాది అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో ఢీ 2(డబుల్ డోస్), కార్తికేయ 2, గూఢచారి 2, బిచ్చగాడు 2, హిట్ 2 ఉన్నాయి. వీటిపైనా అంచనాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దర్శకులు ఈ సినిమా వాటి తగ్గట్లే రూపొందించి ఆదరణ దక్కించుకుంటారా లేదా అనేది చూడాలి.
ఇవీ చదవండి: