కొత్త ఏడాది.. కొత్త సినిమాలు.. కొత్త పోస్టర్లు - రానా విరాటపర్వం సినిమా
సినీ ప్రేక్షకులకు పలు చిత్రబృందాలు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాయి. వారి కోసం కొత్త సినిమా పోస్టర్లతో పాటు పలు అప్డేట్స్ను విడుదల చేశాయి.
కొత్త ఏడాది.. కొత్త సినిమాలు.. కొత్త పోస్టర్లు
అందరితో పాటే కొత్త ఏడాదికి టాలీవుడ్ కూడా ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ అప్డేట్స్తో పాటు కొత్త పోస్టర్లను విడుదల చేసింది. ఈ జాబితాలో 'వకీల్‌సాబ్', 'రాధేశ్యామ్', 'క్రాక్', 'అల్లుడు అదుర్స్', 'విరాటపర్వం', '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?', 'శ్రీకారం', 'కోతి కొమ్మచ్చి', 'వరుడు కావలెను' తదితర చిత్రాలు ఉన్నాయి.