తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బంగార్రాజు' రిలీజ్ డేట్.. 'అతిథి దేవోభవ' ట్రైలర్

Tollywood Latest Updates: టాలీవుడ్ సినిమా అప్​డేట్స్​ వచ్చేశాయి. ఇందులో 'బంగార్రాజు', 'అతిథి దేవోభవ', 'శేఖర్', 'డీజే టిల్లు' చిత్రాలకు సంబంధించిన విశేషాలున్నాయి.

bangarraju
బంగార్రాజు

By

Published : Jan 5, 2022, 8:00 PM IST

Tollywood Latest Updates: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన 'బంగార్రాజు' సినిమా విడుదల తేదీ ఖరారైంది. జనవరి 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని సంక్రాంతికే తీసుకొస్తామని చిత్రబృందం ఎప్పటి నుంచో చెప్తున్నా విడుదల తేదీని ఖరారు చేయకపోవడం వల్ల రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రెస్‌మీట్‌ నిర్వహించి విడుదల తేదీని ప్రకటించింది. 'బంగారా' అనే గీతానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది.

గతంలో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రానికి ప్రీక్వెల్‌గా 'బంగార్రాజు' రూపొందింది. కల్యాణ్‌కృష్ణ దర్శకుడు. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించటం, 'సోగ్గాడే..'కి ప్రీక్వెల్‌ కావటంతో 'బంగార్రాజు' చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. మరోవైపు, ఇదే రోజున విడుదలకానున్న ప్రభాస్‌ 'రాధేశ్యామ్‌' సినిమా వాయిదా పడింది.

అతిథి దేవోభన ట్రైలర్..

యువ నటుడు ఆది సాయికుమార్ నటించిన 'అతిథి దేవోభవ' చిత్రం జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ట్రైలర్​ను నటుడు నాని చేతులమీదుగా రిలీజ్ చేయించింది చిత్రబృందం. ఈ సినిమాకు పొలిమేర నాగేశ్వర్​ దర్శకత్వం వహిస్తుండగా.. నువేక్ష హీరోయిన్​గా నటిస్తుంది. శేఖర్​ చంద్ర సంగీతం అందిస్తున్నారు

శేఖర్..

రాజశేఖర్​ నటిస్తున్న 'శేఖర్' సినిమాలోని 'లవ్​ గంటే మోగిందంట' లిరికల్ సాంగ్​ను విడుదల చేసింది చిత్రబృందం. అనూప్ రూబెన్స్​ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

నాపేరు శివ 2:

తమిళ హీరో కార్తీ నటించిన 'నాపేరు శివ 2' చిత్రం జనవరిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్ నిర్మించింది.

నాపేరు శివ 2

డీజే టిల్లు సాంగ్ ప్రోమో..

సిద్ధు జొన్నలగడ్డ నటించిన 'డీజే టిల్లు' చిత్రంలోని 'టిల్లు అన్న డీజే పెడితే' సాంగ్​ ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం. జనవరి 6 సాయంత్రం 4.05 గంటలకు పూర్తి సాంగ్​ను విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:

మూడు సినిమాలు, ఆరు టికెట్లు అనుకుంటే.. నిరాశే మిగిలెనే!

నటుడి ఇంటి ముందు లేడీ ఫ్యాన్స్ రచ్చ.. నెటిజన్ల ట్రోల్స్

'అఖండ, పుష్ప చిత్రాలు ప్రేక్షకుల్లో నమ్మకాన్ని కలిగించాయి'

Jr NTR Interview: రాజమౌళి, చరణ్​ను ఎన్టీఆర్​ ఏ వంటకంతో పోల్చారంటే?

ABOUT THE AUTHOR

...view details