తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినిమాలే కాదు దైవభక్తీ ముఖ్యమే! - రాజేంద్ర ప్రసాద్​ వార్తలు

టాలీవుడ్ హీరోలకు వరుస సినిమాలతో బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించే సత్తా ఉంది. దానితో పాటుగా కూసింత ఆధ్యాత్మిక చింతన కూడా లేకపోలేదు. కొన్ని సందర్భాల్లో షూటింగ్​లకు విరామాన్ని ప్రకటించి దీక్షలు తీసుకున్న వారూ ఉన్నారు. అలా ఇండస్ట్రీలో దైవారాధనలో ఉన్న హీరోలు ఎవరో తెలుసుకుందాం.

Tollywood heroes with spiritual contemplation
సినిమాలే కాదు ఆధ్యాత్మిక చింతనా ముఖ్యమే!

By

Published : Feb 10, 2021, 5:39 PM IST

టాలీవుడ్​లోని కథానాయకులకు ఆధ్యాత్మిక చింతన కూడా ఉంది. అగ్రహీరోలు పవన్​ కల్యాణ్​, వెంకటేశ్​ వంటివారు తరచుగా దేవాలయాలను సందర్శిస్తుంటూ ఉంటారు. అలానే కొంతమంది హీరోలు అయ్యప్ప మాల, శివ దీక్షలు చేపడుతున్నారు. మెగాస్టార్​ చిరంజీవి నుంచి ఎనర్జిటిక్​ స్టార్​ రామ్​ వరకు చాలా మంది దీక్షలు తీసుకున్నవారు ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్రపరిశ్రమలో ఇప్పటివరకు మాలలు ధరించిన హీరోల గురించి తెలుసుకుందాం.

చిరంజీవి

చిరంజీవి

మెగాస్టార్​ చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆ సమయంలో ఆధ్యాత్మిక చింతన కోసం అయ్యప్ప మాలను ధరించారు.

రామ్​చరణ్​

రామ్​చరణ్​

మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​.. వివాహం తర్వాత అనేక సార్లు అయ్యప్ప దీక్షకు పూనుకున్నారు. 'ధృవ', 'రంగస్థలం' సినిమాల షూటింగ్​ సమయంలో అయ్యప్ప మాల ధరించారు. ప్రస్తుతం 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రీకరణ ప్రారంభంలోనూ.. కరోనా వైరస్​ను జయించిన తర్వాత ఆయన మరోసారి అయ్యప్ప దీక్షను తీసుకున్నారు.

రామ్​

హీరో రామ్​

ఇటీవలే 'రెడ్​' సినిమాలో ప్రేక్షకులకు కొత్త లుక్​తో కనువిందు చేశారు ఎనర్జిటిక్​ హీరో రామ్​. ఈ చిత్రం విడుదల తర్వాత ఆయన శివ దీక్ష తీసుకున్నారు. ఆ విషయాన్ని సోషల్​మీడియాలో వెల్లడించారు. "ఓం నమః శివాయ. చిన్న విరామం తీసుకుంటున్నా. మళ్లీ వస్తా" అని మాల దుస్తులతో ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

శర్వానంద్​

శర్వానంద్​

యువ కథానాయకుడు శర్వానంద్​.. చివరిసారిగా 'జాను' చిత్రంలో నటించారు. ఇప్పుడు ఆయన 'శ్రీకారం' షూటింగ్​లో బిజీగా ఉన్నారు. హీరో రామ్​చరణ్​కు స్నేహితుడైన శర్వానంద్​.. చెర్రీతో కలిసి అనేకసార్లు అయ్యప్ప మాలను వేసుకున్నారు. 'పడి పడి లేచే మనసు' చిత్రీకరణ సమయంలో అయ్యప్ప పడిపూజను ఘనంగా నిర్వహించారు శర్వా.

రామ్​చరణ్​, శర్వానంద్​
మంచు మనోజ్

వీరితో పాటు హీరో మంచు మనోజ్​.. నటుడు రాజేంద్ర ప్రసాద్​ కూడా అయ్యప్ప మాలధారణ ధరించారు.

ఇదీ చూడండి:చిన్నప్పుడే హీరోయిన్​గా ఎంపికై.. ప్రేక్షకులకు దగ్గరై

ABOUT THE AUTHOR

...view details