'కాళిదాసు'తో సినిమా రంగప్రవేశం చేసి 'కరెంట్' చిత్రంతో టాలీవుడ్‌ని 'అడ్డా'గా మార్చుకున్న నటుడు సుశాంత్. అక్కినేని వారసుల్లో ఒకడిగా పరిచయమైన ఈ హీరో ఇటీవల చి.ల.సౌ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈరోజు సుశాంత్ పుట్టినరోజు.
కాళిదాసు కుర్రాడు.. కరెంట్ పిల్లగాడు - sushanth
అక్కినేని వారసుల్లో ఒకడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన హీరో సుశాంత్ పుట్టినరోజు ఈరోజు.
అక్కినేని నాగేశ్వరరావు కూతురైన నాగసుశీల, అనుమోలు సత్యనారాయణ దంపతుల తనయుడే సుశాంత్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. ఉన్నత విద్యలో భాగంగా ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ పూర్తి చేసి యునైటెడ్ టెక్నాలజీస్‌లో ఉద్యోగంలో చేరాడు.
సినిమాలపై ఆసక్తితో నాగచైతన్యతో కలిసి ముంబయిలో నటనలో శిక్షణ తీసుకున్నాడు. 2008లో కాళిదాసు చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత కరెంట్, అడ్డా, ఆటాడుకుందాం రా సినిమాలతో అలరించాడు. 2018లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన చి.ల.సౌ మంచి విజయం సాధించింది. కథానాయకుడిగా ఆయన కెరీర్‌కి కొత్త ఊపిరి పోసింది. అదే ఉత్సాహంతో కొత్త చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నాడు సుశాంత్.