'మన్మథుడు-2' లాంటి భారీ చిత్రం విడుదలైన సమయంలో వచ్చి, ప్రేక్షకుల ఆదరణ పొందింది 'కొబ్బరిమట్ట'. హీరో సంపూర్ణేశ్‌బాబు హాస్యభరిత నటనతో ఆకట్టుకున్నాడు. అంచనాల్లేకుండా వచ్చిన ఈ సినిమా.. ఊహించని వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అగ్ర నిర్మాతలు చూపు సంపూపై పడింది. అతడితో ఓ చిన్న బడ్జెట్ కామెడీ సినిమా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
సంపూ బాబుతో త్వరలో అగ్ర దర్శకుడి సినిమా! - క్రిష్
'కొబ్బరిమట్ట' చిత్రంతో ఆకట్టుకున్న సంపూర్ణేశ్బాబుతో సినిమాలు చేయాలని టాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారట.
హీరో సంపూర్ణేశ్‌బాబు
టాలీవుడ్ అగ్ర దర్శకుడు క్రిష్.. బర్నింగ్స్టార్తో త్వరలో ఓ వినోదాత్మక చిత్రం చేయనున్నాడని సమాచారం. నిర్మాత సి.కల్యాణ్.. సంపూతో ఓ ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు ప్రణాళికల రచిస్తున్నారు. ఏదేమైనా 'కొబ్బరిమట్ట'తో టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాడీ నటుడు.
ఇది చదవండి: రెండ్రోజుల్లో రూ.200 కోట్లు.. సాహో సునామీ
Last Updated : Sep 29, 2019, 2:17 AM IST