తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ముఖ్యమంత్రి కేసీఆర్​కు నందమూరి బాలకృష్ణ ధన్యవాదాలు - hero balakrishna news

అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి జీవితాన్ని భవిష్యత్తు తరాలకు తెలిపేలా పాఠ్య పుస్తకాల్లో ప్రచురించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు బాలయ్య ఫేస్‌బుక్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. పుస్తకంలో కథనానికి సంబంధించిన ఫొటోల్ని కూడా షేర్‌ చేశారు.

Tollywood Hero Nandamuri Balskrishna thanked Telangna Chief Minister KCR
ముఖ్యమంత్రి కేసీఆర్​కు నందమూరి బాలకృష్ణ ధన్యవాదాలు

By

Published : Sep 5, 2020, 4:21 PM IST

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపుతూ ఫేస్​బుక్​లో పోస్టు చేశారు.

‘కళకి, కళాకారులకి విలువ పెంచిన కథానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని దిల్లీ పీఠాన్ని కదిలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మద్రాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ మా నాన్నగారు నందమూరి తారక రామారావు. భవిష్యత్తు తరాలకి స్ఫూర్తినిచ్చేలా ఆయన గురించి 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు’ అని బాలయ్య పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details