తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెగాఫోన్ పట్టే చేతితో గరిటె పట్టారు

షూటింగ్​ల్లో మైక్​ పట్టి సందడి చేసే దర్శకులు ప్రస్తుతం ఇంటి పనుల్లో మునిగిపోయారు. సామాజిక మాధ్యమాల్లో 'బీ ద రియల్​మ్యాన్'​ ఛాలెంజ్​లో భాగంగా ఇంటి పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Tollywood Directors involves in #BeTheREALMAN Challenge
ఇంటి పనుల్లో బిజీగా గడుపుతున్న టాలీవుడ్​ దర్శకులు

By

Published : Apr 24, 2020, 2:53 PM IST

ప్రస్తుతం టాలీవుడ్‌కు 'బీ ద రియల్​మ్యాన్'​ ఫీవర్‌ పట్టుకుంది. అగ్ర నటులు, దర్శకులు, సంగీత దర్శకులు ఒకరిపై ఒకరు ఛాలెంజ్‌ విసురుకుంటూ ఇంటి పనుల్లో మహిళలకు సాయం చేస్తున్నారు. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి విసిరిన సవాల్‌ను దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి పూర్తి చేశారు. మొక్కలకు నీళ్లుపోసి, ఇల్లు తుడిచి, వంట చేసి వాళ్ల అమ్మ కోసం పట్టుకెళ్లారు. ఆ తర్వాత ఈ ఛాలెంజ్‌ను పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌ పూర్తి చేయాల్సిందిగా సవాల్‌ విసిరారు.

హీరో వెంకటేశ్.. దర్శకుడు అనిల్​ రావిపూడికి ఛాలెంజ్​ చేయగా.. అనిల్​ ఇంటిని శుభ్రం చేయటం సహా వంట పనుల్లో సహాయం చేస్తున్న వీడియోను తాజాగా ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. హీరోలు కల్యాణ్​ రామ్​, సాయిధరమ్​ తేజ్​, రవితేజకు ఈ ఛాలెంజ్​ను స్వీకరించమని కోరారు.

దర్శకుడు బోయపాటి శ్రీను గరిటె పట్టారు. అయితే, ఇది సామాజిక మాధ్యమాల్లో సాగుతోన్న ఛాలెంజ్‌లో మాత్రం భాగం కాదు. క్వారంటైన్‌ టైమ్‌లో సరదాగా తన కుటుంబానికి వంట చేసి పెడుతున్న వీడియోను పంచుకున్నారు. బోయపాటి వంట చేయడంలో వాళ్ల పిల్లలు సాయం చేశారు.

ఇదీ చూడండి.. మెగాస్టార్​ కొత్త సినిమాలో హీరోయిన్​ లేదట!

ABOUT THE AUTHOR

...view details