యువ దర్శకురాలు సంజనారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో కళ్లు తిరిగి పడిపోవడం వల్ల ఆమెను కుటుంబసభ్యులు సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారన్న వార్తలపై స్పందించారు నిర్మాత, రచయిత కోనా వెంకట్.
వెంటిలేటర్‌పై 'కరణం మల్లీశ్వరి' దర్శకురాలు! - వెంటిలేటర్‌పై కరణం మల్లీశ్వరి దర్శకురాలు
దర్శకురాలు సంజనా రెడ్డి అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చేరారు. డైట్లో ఉండటం వల్ల బలహీనతకు గురైనట్లు నిర్మాత కోన వెంకట్ తెలిపారు.
సంజనా
"ఆమె కొంతకాలంగా డైట్లో ఉంది. కొద్దిరోజులుగా లిక్విడ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటోంది. దానివల్ల బలహీనతకు గురైంది. అంతే తప్ప వేరే కారణం ఏమీ లేదు. త్వరలోనే ఆమె డిశ్చార్జ్ అవుతుంది." అని కోనా చెప్పారు.
యువ నటుడు రాజ్ తరుణ్‌తో తెరకెక్కించిన 'రాజుగాడు'తో దర్శకురాలిగా పరిచయమైంది సంజన. ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని సాధించలేదు. ఇటీవలే కరణం మల్లీశ్వరి బయోపిక్‌ను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. కోనా వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Last Updated : Jun 9, 2020, 11:34 AM IST