తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వారి సూచనలు పాటిస్తే కరోనా నుంచి మీరు భద్రం' - movie news

కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు పలువురు సెలబ్రిటీలు. వీరిలో దర్శక-నటుడు తరుణ్ భాస్కర్, గాయని గీతామాధురి, నటీమణులు అనసూయ, హరితేజ ఉన్నారు.

టాలీవుడ్ సెలబ్రిటీలు
గీతామాధురి-అనసూయ-హరితేజ

By

Published : Apr 11, 2020, 1:40 PM IST

కరోనా వల్ల ఏర్పడిన ఈ విపత్కర పరిస్థితుల్లో మనిషికి మనిషే సాయంగా ఉండాలని పలువురు టాలీవుడ్ నటీనటులు కోరుతున్నారు. ఈ మహమ్మారి ధాటికి ఆకలితో అలమటిస్తున్న వారికి అండగా నిలవాలని అంటున్నారు.

కరోనా కట్టడి కోసం సూచనలిస్తున్న పలువురు సెలబ్రిటీలు

ఈ వైరస్​ కట్టడి కోసం యుద్ధం చేస్తున్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులను గౌరవించాలని, వారు చెప్పిన సూచనలు పాటిస్తే కరోనా బారి నుంచి బయటపడొచ్చని యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ చెప్పారు.

ఈ మహ్మమారిపై పోరులో ప్రజల గెలుపు ఖాయమని చెబుతోంది ప్రముఖ నేపథ్య గాయని గీతామాధురి. టీవీ వ్యాఖ్యత, నటి అనసూయ.. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవ్వాలని కోరుతోంది. నటి, వ్యాఖ్యత హరితేజ.. పొరుగువారికి సాయం చేయమని చెబుతోంది.

ABOUT THE AUTHOR

...view details