తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చరణ్​ ఈరోజే ఎందుకు పుట్టాడో అర్థమైంది: చిరు - ప్రపంచ రంగస్థల దినోత్సవం

మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్​లో పలువురు ప్రముఖులు అతడికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ రంగస్థల దినోత్సవం నాడే చెర్రీ పుట్టాడని మెగాస్టార్​ చిరంజీవి ఈ సందర్భంగా గుర్తుచేశాడు.

Tollywood Celebraties Wishing to Ramcharan on his Birthday
చరణ్​ ఈ రోజే ఎందుకు పుట్టాడో అర్ధమైంది: చిరంజీవి

By

Published : Mar 27, 2020, 4:08 PM IST

Updated : Mar 27, 2020, 4:14 PM IST

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ మార్చి 27 (ప్రపంచ రంగస్థల దినోత్సవం)న ఎందుకు పుట్టాడో తనకి కొంతకాలనికి అర్థమైందని మెగాస్టార్​ చిరంజీవి అన్నాడు. నేడు రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపాడు చిరు.

"రామ్‌ చరణ్‌ పుట్టినప్పుడు నేను ఎంతో సంతోషించాను. మార్చి 27.. ప్రపంచ రంగస్థల దినోత్సవం. ఆ రోజు చరణ్ జన్మించడానికి గల కారణం ఆ తర్వాత నాకు అర్థమైంది. చేపలకు నీళ్లలాగా అతను నటనను స్వీకరించాడు. ఈ పండుగ రోజున హ్యాపీ బర్త్‌డే చరణ్‌"

- చిరంజీవి, కథానాయకుడు

రామ్​చరణ్​ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు సోషల్‌మీడియాలో అతడికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా చెర్రీకి బహుమతిగా ఓ అభిమాని ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ఆ పాటకు సంబంధించిన వీడియోను ఉపాసన, కాజల్‌, తమన్నా, అనసూయ ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశారు.

"నా బావ రామ్‌చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం నీ జీవితంలో మరెన్నో విజయాలను, సంతోషాలను అందించాలని కోరుకుంటున్నాను. ఈరోజు నిన్ను కలవాలని అనుకున్నాను. కానీ ఓ మంచి పని కోసం మనందరం ఇళ్లకే పరిమితమయ్యాం"

- అల్లు అర్జున్‌, కథానాయకుడు

"చిరుత సినిమా కోసం రామ్‌చరణ్‌తో కలిసి పనిచేయడం నాకెంతో సంతోషంగా ఉంది. నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో నాకు ఈ అవకాశాన్ని కల్పించిన నా గురూజీ పూరి జగన్నాథ్‌కు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్‌డే రామ్‌చరణ్‌. నీకు మరింత సంతోషం, విజయం అందాలని కోరుకుంటున్నాను. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నువ్వు చాలా మందిలో స్ఫూర్తి నింపావు."

- హరీశ్‌ శంకర్‌, దర్శకుడు

"హ్యాపీ బర్త్‌డే మిత్రమా.. మంచి మనసున్న నువ్వు వందేళ్లపాటు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. లవ్‌ యూ బాబాయ్‌. వెల్‌కమ్‌ టు ట్విట్టర్‌"

- మంచు మనోజ్‌, కథానాయకుడు

"యువ సింహానికి హ్యాపీ బర్త్‌డే. ప్రతిఒక్కరి పట్ల నువ్వు చూపించే వినయం, ఆత్మీయత ఎంతో మనోహరమైనవి. దేవుడి దీవెనలు ఎల్లప్పుడూ నీతో ఉండాలని కోరుకుంటున్నాను"

- ప్రసాద్‌ వి. పొట్లూరి, నిర్మాత

"హ్యాపీ బర్త్‌డే రామ్‌చరణ్‌. నీకు దేవుడు మంచి ఆరోగ్యం, సంతోషం అందించాలని కోరుకుంటున్నాను. మనందరం కలిసి చిన్నప్పుడు టూర్‌కు వెళ్లినప్పుడు తీసుకున్న ఓ అపురూపమైన చిత్రమిది"

- సాయి తేజ్‌, కథానాయకుడు

"చిరంజీవి రామ్‌చరణ్‌ తేజ్‌కు జన్మదిన శుభాకాంక్షలు"

- కీరవాణి, సంగీత దర్శకుడు

"స్వచ్ఛమైన హృదయం, సూపర్‌ టాలెంటెడ్‌ మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రానికి నా అభినందనలు

-- బాబీ, దర్శకుడు

సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి వస్తోన్న బర్త్‌డే విషెస్‌పై రామ్‌చరణ్‌ స్పందించాడు. 'అర్ధరాత్రి నుంచి మీరు పంపిస్తున్న బర్త్‌డే విషెస్‌ చూసి నేను ఎంతో సంతోషించాను. మీ అందరి ప్రేమాభిమానులు చూశాక.. నేను మీ నుంచి ఒక గిఫ్ట్‌ పొందాలనుకుంటున్నాను. లాక్‌డౌన్‌ పూర్తయ్యేవరకూ మీ అందరూ ఇంట్లోనే ఉండండి. అదే మీరు నాకిచ్చే పెద్ద బహుమతి' అని చెర్రీ అందులో పేర్కొన్నాడు.

రామ్​చరణ్​
Last Updated : Mar 27, 2020, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details