తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ట్విట్టర్​లో 'మన్నెం దొర'కు విశేష స్పందన - ఎన్టీఆర్​ న్యూస్​

మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రబృందం. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విశేషాదరణ దక్కించుకుంది. దీనిపై పలువురు టాలీవుడ్​ ప్రముఖులు స్పందించారు.

Tollywood Celebraties Responds On Ramcharan's Birthday Surprise Video #BheemforRamaraju
ట్విట్టర్​లో 'మన్నెం దొర'కు విశేషాదరణ

By

Published : Mar 28, 2020, 1:05 PM IST

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకులుగా దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం). ఉగాది కానుకగా టైటిల్​తో పాటు​ మోషన్​ పిక్చర్​ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. శుక్రవారం (మార్చి 27) చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా అతడి పాత్రను పరిచయం చేస్తూ.. ఎన్టీఆర్​ గాత్రంతో ఓ సర్​ప్రైజ్​ వీడియోను రిలీజ్​ చేసింది. దీనిపై పలువురు టాలీవుడ్​ ప్రముఖులు ట్విట్టర్​లో స్పందించారు.

ఈ చిత్రంలో రామ్​చరణ్, అల్లూరి సీతారామరాజుగా.. తారక్, కొమురం భీమ్​గా కనిపించనున్నారు. ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవగణ్​, సముద్రఖని, రే స్టీవెన్​సన్, అలిసన్ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నాడు. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్​తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇదీ చూడండి.."ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్టుంటది"

ABOUT THE AUTHOR

...view details