టాలీవుడ్ హీరోయిన్ నిత్యా నరేష్ నిజామాబాద్ జిల్లాలో సందడి చేసింది. డిచ్పల్లిలోని మానవతా సదన్ అనాథాశ్రమానికి వచ్చిన నిత్య.. విద్యార్థులకు చిత్రలేఖనం సామాగ్రి అందజేసింది. అనంతరం వారితో కలిసి నృత్యాలు చేసింది.
"మా కుటుంబం ఐదు తరాల నుంచి వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఈ వారంలో నా పుట్టిన రోజు ఉంది. ఈ సమయంలో మానవతా సదన్‌ను సందర్శించడం ఆనందంగా ఉంది" -నిత్యా నరేష్, సినీ నటి