స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. శేషాచలం అడవుల నేపథ్య కథతో ఈ సినిమా తీస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడనేది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అతడికి తోడుగా మరో ఇద్దరు ప్రతినాయకులు సిద్ధమవుతున్నారు. ఆ విషయాన్ని అందులో ఒకడైనా రాజ్దీపక్ శెట్టి చెప్పాడు.
ముగ్గురు విలన్లతో ఫైట్స్ చేయనున్న అల్లు అర్జున్ - tollywood news
బన్నీ-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న #ఏఏ20లో ముగ్గురు విలన్లు కనిపించనున్నారు. ఈ విషయాన్ని అందులో ఒకడైనా రాజ్దీపక్ శెట్టి చెప్పాడు.
అల్లు అర్జున్
తను, జగపతిబాబు, విజయ్ సేతుపతి.. #ఏఏ20లో విలన్లుగా నటిస్తున్నామని అన్నాడు. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కేరళ అడవుల్లో షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
ఇది చదవండి:నా పెళ్లి గురించి అంత చర్చ ఎందుకు? : అనుష్క