తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రానా-మిహీకా పెళ్లి.. ముచ్చటగా మూడు రోజుల వేడుక - Miheeka Bajaj latest news

అగ్ర నటుడు రానా దగ్గుబాటి త్వరలో తన ప్రియురాలు మిహీకా బజాజ్‌ మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. ఆగస్టు మొదటి వారంలో వీరిద్దరి వివాహం జరగనుంది. అయితే పెళ్లి వేడుక ముచ్చటగా మూడు రోజులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Rana Daggubati to marry Miheeka Bajaj
పెళ్లి వేడుక మూడు రోజులు

By

Published : Jun 2, 2020, 7:48 AM IST

దగ్గుబాటి కుటుంబంలో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. ప్రముఖ కథానాయకుడు రానా ఆగస్టు 8న మిహీకా బజాజ్‌ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు. వీరి వివాహాన్ని హైదరాబాద్‌లోనే జరిపేందుకు దగ్గుబాటి, బజాజ్‌ కుటుంబాలు ఏర్పాట్లు మొదలు పెట్టాయి. పెళ్లి వేడుకల్ని మూడు రోజులపాటు నిర్వహించబోతున్నారు. పెళ్లికి రెండు రోజుల ముందు ఆగస్టు 6, 7 తేదీల్లో వేడుకలు జరగబోతున్నాయి. కుటుంబ సభ్యులు, పరిమిత సంఖ్యలో సన్నిహితుల సమక్షంలో తెలుగు, మార్వాడీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుకల్ని నిర్వహిస్తారు.

రానా, మహికా

కరోనా ప్రభావం దృష్ట్యా ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే ఈ వేడుకని నిర్వహించాలని ఇరు కుటుంబాల వారు నిర్ణయించారు. ముహూర్తం నాటికి పరిస్థితుల్నిబట్టి వేడుకకి హాజరయ్యే అతిథుల సంఖ్య ఉండబోతోంది. రానాకి కాబోయే భార్య మిహీకా వెడ్డింగ్‌ ప్లానర్‌. ఆమె ఆలోచనలకు అనుగుణంగా, ప్రత్యేకమైన థీమ్‌తో పెళ్లి వేడుకలు జరగబోతున్నాయట. స్నేహితులుగా ఉంటూ మనసులు ఇచ్చి పుచ్చుకున్న రానా, మిహీకా జంట తమ ప్రేమ విషయాన్ని పెద్దలకి చెప్పి ఒప్పించారు. ఇటీవలే ఇరు కుటుంబాల సమక్షంలో రోకా వేడుక జరిగింది. "నిశ్చితార్థాన్ని నిర్వహించడం లేదని, నేరుగా పెళ్లి చేయబోతున్నాం" అని రానా తండ్రి డి.సురేష్‌బాబు తెలిపారు.

రానా, మహికా జంట

రానా దగ్గుబాటికి దక్షిణాదిలోనే కాకుండా, హిందీలోనూ మంచి గుర్తింపు ఉంది. ఆయన కథానాయకుడిగా నటించిన ‘అరణ్య’ త్వరలోనే విడుదల కాబోతోంది. ప్రస్తుతం ‘విరాటపర్వం’లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి: 'రోజంతా ఆలోచించి సాయంత్రం ప్రపోజ్ చేశా'

ABOUT THE AUTHOR

...view details