తెలంగాణ

telangana

ETV Bharat / sitara

థియేటర్/ఓటీటీలో ఈ వారం రిలీజయ్యే సినిమాలు ఇవే - taapsee loop lapeta

This week movie release: ఎప్పటిలానే ఈ వారం కూడా పలు సినిమాలు ఆడియెన్స్​ను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకీ ఆ చిత్రాలేంటి? వాటి సంగతేంటి?

this week telugu movie releases
దిస్ వీక్ మూవీ రిలీజ్

By

Published : Jan 31, 2022, 10:30 AM IST

OTT this week: కరోనా కారణంగా పెద్ద సినిమాలన్నీ వాయిదా పడేసరికి ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిన్న సినిమాలు ఈ వారం వరుసగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆ సినిమాలేంటో చూసేయండి.

'సామాన్యుడు' వస్తున్నాడు

విశాల్‌ కథానాయకుడిగా నటించిన 'సామాన్యుడు' ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ఖరారు చేసింది. తు.ప.శరవణన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ స్వయంగా నిర్మిస్తున్నారు. ఆయనకు జోడీగా డింపుల్‌ హయాతి నటించింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం యాక్షన్‌ ప్రధానంగా సాగుతుంది. విశాల్‌ మరోసారి ఓ సరికొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారని, ఇటీవల విడుదల చేసిన పాటలకు, ప్రచార చిత్రాలకు చక్కటి స్పందన లభిస్తోందని సినీ వర్గాలు తెలిపాయి.యువన్ శంకర్​ రాజా సంగీతమందించారు.

విశాల్ 'సామాన్యుడు'

'కోతల రాయుడు' ఏం చేస్తాడు?

నటుడు శ్రీకాంత్‌ కీలక పాత్రలో సుధీర్‌ రాజు తెరకెక్కించిన చిత్రం 'కోతల రాయుడు'. డింపుల్‌ చోపడే, నటాషా దోషి కథానాయికలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదల కానుంది. గతంలో చిరంజీవి నటించిన 'కోతల రాయుడు' టైటిల్‌తో శ్రీకాంత్‌ సినిమా చేయడం ఆసక్తికరం. ఇటీవల బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ'లో ప్రతినాయకుడిగా మెప్పించిన శ్రీకాంత్‌ మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

శ్రీకాంత్ 'కోతలరాయుడు' మూవీ

కె3 'కోటికొక్కడు' కథేంటి?

కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌(kiccha sudeep) కథానాయకుడిగా శివ కార్తిక్‌ తెరకెక్కించిన చిత్రం 'కె3'. కోటికొక్కడు.. అన్నది ఉపశీర్షిక. శ్రేయాస్‌ శ్రీనివాస్‌, దేవేంద్ర సంయుక్తంగా నిర్మించారు. మడోన్నా సెబాస్టియన్‌, శ్రద్ధా దాస్‌, ఆషిక కథానాయికలు. ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సుదీప్‌ రెండు భిన్నమైన గెటప్పుల్లో కనిపించనున్నారు. ఓవైపు మాస్‌గా కనిపిస్తూనే.. మరోవైపు స్టైలిష్‌ యాక్షన్‌తోనూ అలరించేందుకు సిద్ధమయ్యారు.

సుదీప్ 'కె3' మూవీ

అతడు ఆమె.. ప్రియుడు

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'అతడు ఆమె ప్రియుడు'. సునీల్‌, కౌశల్‌, బెనర్జీ ముఖ్యపాత్రధారులు. రవి కనగాల, రామ్‌ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఝాన్సీ కూనం సమర్పిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేర నేపథ్యంలో సాగే ప్రేమకథతో చిత్రం రూపొందినట్టు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది.

.
.

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు

ఓటీటీలో తాప్సీ 'లూప్‌ లపటే'

తాప్సి, తాహిర్‌ రాజ్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం 'లూప్‌ లపేట'. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తున్నారు. సోనీ పిక్చర్‌ ఫిల్మ్‌ నిర్మించిన ఈ సినిమా కామెడీ థ్రిల్లర్‌ జానర్లో రూపొందింది. హాలీవుడ్‌ చిత్రం 'రన్‌ లోలా రన్‌'కు రీమేక్‌ ఇది. ఆకాశ్‌ భాటియా తెరకెక్కించారు. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 'లూప్‌ లపేట' స్ట్రీమింగ్‌ కానుంది.

తాప్సీ లూప్ లపేటా

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

* ఒన్‌ కట్‌ టూ కట్‌ (కన్నడ) ఫిబ్రవరి 4

* రీచర్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 4

నెట్‌ఫ్లిక్స్‌

* ద టిండర్‌ స్విండ్లర్‌(హాలీవుడ్‌) ఫిబ్రవరి 2

* ఫైండింగ్‌ ఓలా(వెబ్ సిరీస్‌) ఫిబ్రవరి 3

* మర్డర్‌ విల్లే (వెబ్‌ సిరీస్‌) ఫిబ్రవరి 3

* థ్రూ మై విండ్‌ (హాలీవుడ్‌)ఫిబ్రవరి 4

జీ5

* 100 (కన్నడ) ఫిబ్రవరి 4

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

* ద గ్రేట్‌ ఇండియన్‌ మర్డర్‌ (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 4

సోనీ లివ్‌

* రాకెట్‌ బాయ్స్‌ (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 4

రాకెట్ బాయ్స్ మూవీ

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details