తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆస్కార్​ గెలిచిన 'గాంధీ'.. రికార్డులకు నాంది - గాంధీ సినిమా వార్తలు

బ్రిటీష్ దర్శకుడు రిచర్డ్ అటెన్​బరో డ్రీమ్ ప్రాజెక్టు గాంధీ. 1982, నవంబర్​ 30న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించడమే కాకుండా 8 ఆస్కార్​లు కైవసం చేసుకుంది. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి నేటికి 38 ఏళ్లు పూర్తయ్యాయి.

gandhi movie news
ఆస్కార్​నే గెలిచిన 'గాంధీ'.. రికార్డులకు నాంది

By

Published : Nov 30, 2020, 5:55 AM IST

మోహన్​దాస్ కరమ్​చంద్ గాంధీ.. మహాత్మా అనే పదాన్ని ఇంటిపేరుగా మార్చుకుని.. ఓ దేశం.. కాదు.. కాదు యావత్ ప్రపంచమే మరిచిపోలేని మహనీయుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన గురించి చెప్పాలంటే మాటలు చాలవు.. రాస్తే పుస్తకాలకు ప్రదేశం సరిపోదు. బయోపిక్​లా తీయాలంటే ఎన్ని భాగలైనా తీస్తూనే ఉండాలి. అంతగా ముద్రవేశారు. గాంధీపై ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చాయి. వీటిలో ఎప్పటికీ గుర్తిండిపోయే సినిమా గాంధీ. 1982లో విడుదలైన ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర అంశాలు ఇప్పుడు చూద్దాం!

గాంధీ సినిమా పోస్టర్​

ఆస్కార్ పొందిన తొలి భారతీయురాలు..

ఇంగ్లీష్ దర్శకుడు రిచర్డ్​ అటెన్​బరో తెరకెక్కించిన ఈ సినిమా 1982 నవంబరు 30న భారత్​లో విడుదలైంది. అప్పట్లోనే 22 మిలియన్ డాలర్లు(రూ. 156 కోట్లు)తో తెరకెక్కిన ఈ చిత్రం 127 మిలియన డాలర్లు(రూ. 902 కోట్లు పైగా) వసూలు చేసింది. 11 ఆస్కార్లకు నామినేటైన ఈ సినిమా ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రంతో పాటు 8 పురస్కారాలు గెల్చుకుంది. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్​గా భాను అతియా అవార్డు కైవసం చేసుకున్నారు. ఆస్కార్ అందుకున్న తొలి భారతీయురాలిగా ఆమె రికార్డు సృష్టించారు.

ఒక్క సీన్​ కోసం 3లక్షల మందితో చిత్రీకరణ...

ఆరు నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది గాంధీ చిత్రం. ఇందులో బాపూ అంత్యక్రియలు జరిగే సన్నివేశం కోసం 3లక్షల మందితో చిత్రీకరించారు. గ్రాఫిక్స్​లేని ఆ రోజుల్లో ఇంతమందిని ఓ చోట ఉంచి షూటింగ్ చేసి.. గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది చిత్రబృందం.

గాంధీ సినిమాలో సన్నివేశం

బాపూ బయోపిక్​ కోసం నెహ్రూతో ఒప్పందం..

గాంధీ జీవితం ఆధారంగా సినిమా రూపొందించాలని రెండు సార్లు విఫలయత్నం చేశారు హాలీవుడ్ దర్శకులు. 1952లో గాబ్రీయేల్ పాస్కల్ అనే దర్శకుడు బాపూపై సినిమా తీయాలని అప్పటి ప్రధాని జవహర్​లాల్​ నెహ్రూతో ఒప్పందం చేసుకున్నారు. నెహ్రూనే స్వయంగా నిర్మాతగా వ్యవహారించాల్సిన ఆ సినిమా పాస్కల్ మృతితో ఆగిపోయింది. అనంతరం మరో దర్శకుడు డేవిడ్ లీన్ కూడా గాంధీపై చిత్రం తీయాలని ప్రయత్నించి కొన్ని కారణాల వల్ల విరమించుకున్నారు.

మహాత్ముడు

గొంతు అరువిచ్చిన బాలు..

గాంధీ సినిమా తెలుగులోనూ అనువదించారు. ఇందులో బాపూ పాత్రధారికి డబ్బింగ్ చెప్పారు దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

దిగ్గజ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం

బాపూ పాత్రదారి భారతీయుడే..

ఇందులో గాంధీ పాత్రలో నటించింది హాలీవుడ్ నటుడు కింగ్ బెన్స్​లీ. ఈయన భారత సంతతికి చెందిన వ్యక్తి. ఈయన పూర్వీకులు గుజరాత్​ నుంచి జాంజీబార్​కు వలస వెళ్లారు. బెన్సలీ అసలు పేరు కృష్ణ పండిట్ భాన్​జీ.

హాలీవుడ్ నటుడు కింగ్ బెన్స్​లీ

అటెన్​బరో డ్రీమ్​ ప్రాజెక్టు..

ఈ సినిమా దర్శకుడు రిచర్డ్ అటెన్​బరో డ్రీమ్ ప్రాజెక్టు. అప్పటికే రెండు సార్లు ప్రముఖ హాలీవుడ్ దర్శకులు ప్రయత్నించి తీయడంలో విఫలమయ్యారు. కానీ రిచర్డ్ 18 ఏళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డారు. 1962లో రిచర్డ్​కు లండన్​లో భారత హై కమిషన్​లో పనిచేస్తున్న మోతీలాల్ కొఠారి అనే సివిల్ సర్వెంట్​ నుంచి ఫోన్​ కాల్ వచ్చింది. బాపూ జీవితం గురించి అతడితో చర్చించి గాంధీపై సినిమా తీయడానికి సిద్ధమయ్యారు రిచర్డ్. ఇందుకోసం మాజీ ప్రధాని ఇందిరా గాంధీతోనూ మాట్లాడారు దర్శకుడు. చివరి వైస్రాయ్ మౌంట్​బాటెన్, నెహ్రూ గురించి ఇందిరా గాంధీ నుంచి సమాచారం సేకరించారు.

దర్శకుడు రిచర్డ్​ అటెన్​బరో

1964లో కొఠారి మరణించడం వల్ల ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. కానీ పట్టువదలని రిచర్డ్ సినిమా కోసం పరిశోధన చేస్తూనే ఉన్నారు. 1976లో సినిమా తీసేందుకు ఉపక్రమించిన రిచర్డ్​కు ఎమర్జెన్సీ వల్ల వీలుపడలేదు. ఆటుపోటులు ఎదుర్కొని చివరికి 1980లో సినిమాకు శ్రీకారం చుట్టారు.

ABOUT THE AUTHOR

...view details