బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాను కొనియాడి అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేసింది కంగనా రనౌత్. ప్రియాంకతో కలిసి 'ఫ్యాషన్' సినిమాలో నటించింది కంగన. 2008లో విడుదలైన ఈ సినిమా నేటితో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంగనా రనౌత్.. 'ఫ్యాషన్' సినిమా షూటింగ్ రోజులను గుర్తుచేసుకుంది.
'ప్రియాంక గుణం గొప్పది'
'ఫ్యాషన్' సినిమా కోసం ప్రియాంకతో కలిసి సహనటిగా పనిచేయడం చాలా గొప్ప విషయం అని పేర్కొంది కంగన. స్టార్ నటి అనే భావన లేకుండా ప్రియాంక ఇతరులతో ప్రవర్తించే తీరు తనకు చాలా నచ్చిందని తెలిపింది. 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రియాంకా చోప్రా సినిమాలు విపరీతంగా చూస్తుండేదానినని గుర్తుచేసుకుంది.