'రాజి' నటి ఆలియా భట్.. షాహిద్ కపూర్‌లు కలిసి మరోసారి తెరపై సందడి చేయనున్నారు. ఈ చిత్రానికి కరణ్ జోహర్ నిర్మాతగా వ్యవరించనున్నాడు. అయితే దర్శకుడు ఎవరనేది ఇంకా తెలియలేదు. ఈ సినిమాలో షాహిద్ దేశభక్తుడిగా నటించనున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ ఏడాది మధ్యలోనే సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది చిత్రబృందం.
ఆలియా-షాహిద్ కొత్త సినిమా దర్శకుడు ఎవరు? - entertainment news
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, ఆలియా భట్ జంటగా ఓ కొత్త సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు అనే విషయమై సర్వాత్రా ఆసక్తి నెలకొంది.
గతంలో కరణ్ జోహర్ నిర్మాణంలో ఆలియా - షాహిద్ కపూర్ కలిసి 'షాందార్' అనే చిత్రంలో నటించారు. అభిషేక్ చౌబే దర్శకత్వంలో వచ్చిన 'ఉడ్తా పంజాబ్'లోనూ వీరిద్దరూ జోడిగా కనిపించారు. ప్రస్తుతం ఆలియా రణ్‌బీర్‌తో కలిసి 'బ్రహ్మాస్త్ర'తో పాటు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘'గంగుబాయి కతియావాడి’'లో నటిస్తోంది. తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'లో రామ్‌చరణ్ సరసన కనిపించనుంది. షాహిద్ తెలుగులో వచ్చిన ‘'జెర్సీ' చిత్రాన్ని అదే పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నాడు.
ఇదీ చదవండి: రివ్యూ:'వరల్డ్ ఫేమస్ లవర్'గా విజయ్ మెప్పించాడా?