తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రముఖ నటుడు మృతి.. డ్రగ్సే కారణమా? - the wire news

ప్రముఖ హాలీవుడ్​ నటుడు మైఖేల్​ కె విలియమ్స్​(54)(michael k williams died) కన్నుమూశారు. మాదక ద్రవ్యాలు అధికంగా తీసుకోవడం వల్ల విలియమ్స్​ మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.

michael-k-williams
మైఖేల్​ కె విలియమ్స్

By

Published : Sep 7, 2021, 6:42 AM IST

అమెరికా ప్రముఖ టెలివిజన్‌ షో 'ది వైర్‌'(the wire episodes) సిరీస్‌ నటుడు మైఖేల్‌ కె విలియమ్స్‌(54)(michael k williams died) న్యూయార్క్‌ సిటీలో తుదిశ్వాస విడిచారు.

విలియమ్స్‌(michael k williams movies) ఎలా మృతి చెందారన్నదానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాదక ద్రవ్యాలు అధికంగా తీసుకోవడం వల్ల విలియమ్స్​ మృతిచెందినట్లు అధికారులు భావిస్తున్నారు. 2002 నుంచి 2008 మధ్య అమెరికా కేబుల్‌ నెట్‌వర్క్‌ అయిన హెచ్‌బీఓలో 'ది వైర్‌' టెలివిజన్ సిరీస్‌ ప్రసారమైంది. డ్రగ్‌ డీలర్‌ పాత్రలో ఓమర్‌ లిటిల్‌గా ఆయన ఒక్కసారిగా వేల మంది అభిమానులను సంపాదించుకున్నారు. 'లవ్‌క్రాఫ్ట్ కంట్రీ' సిరీస్‌లో విలియమ్స్‌ ఉత్తమ నటనతో 2021 ఎమ్మీ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. 'బోర్డ్‌వాక్‌ ఎంపైర్‌' సిరీస్‌లోనూ ఆయన నటనకు మంచి పేరు వచ్చింది.

ఇదీ చూడండి: ప్రముఖ బాలీవుడ్ నటుడు మృతి

ABOUT THE AUTHOR

...view details