బాలీవుడ్ గాయని కనికా కపూర్‌కు ఎట్టకేలకు కరోనా నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం లఖ్‌నవూలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స తీసుకుంటోంది. తాజాగా ఆరోసారి జరిపిన వైద్య పరీక్షల్లో ఆమెకు నెగిటివ్‌గా తేలింది. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మరికొన్ని రోజులపాటు ఆమెను ఆసుపత్రిలోనే ఉంచి పలు టెస్టులు చేసిన అనంతరం డిశ్చార్జ్ చేయనున్నారు.
గాయని కనికా కపూర్‌కు ఎట్టకేలకు కరోనా నెగిటివ్ - covid news
గాయని కనికా కపూర్‌కు ఆరోసారి చేసిన వైద్యపరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చింది. ఈ విషయం తెలిసి ఆమె కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
గత నెల 9న లండన్ వచ్చిన కనికా.. ఉత్తరప్రదేశ్‌లోని హోటల్లో బస చేసింది. ఆ తర్వాత పలు పార్టీలకు హాజరై.. పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను కలిసింది. ఆ తర్వాత కొన్నిరోజులకు ఆమెకు కరోనా సోకినట్లు తేలడం సంచలనమైంది. దీంతో ఈమెను కలిసిన వారు క్వారంటైన్లోకి వెళ్లారు. మరోవైపు ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు పాటించకుండా, కరోనా వచ్చినా పార్టీలకు వెళ్లినందుకు పోలీసులు కనికాపై కేసు నమోదు చేశారు.
ఇది చదవండి:''ఆర్ఆర్ఆర్' విడుదలలో వాయిదా లేదు.. అనుకున్న సమయానికే వస్తాం'