తెలంగాణ

telangana

By

Published : Mar 26, 2020, 11:13 AM IST

ETV Bharat / sitara

కరోనా కట్టడికి మహేశ్​బాబు ఆరు సూత్రాలు

ప్రపంచ దేశాల్ని వణికిస్తోన్న కరోనా వైరస్​ పట్ల ప్రతి ఒక్కరు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కోరాడు హీరో​ మహేశ్​బాబు. ఇందుకోసం ఆరు సూత్రాలను సూచించాడు​.

The six principles are most Important to Control the Corona virus
మహేశ్ బాబు కరోనా కట్టడి సూత్రాలు

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఆరు సూత్రాలు చెప్పాడు. ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పిన ప్రిన్స్​... ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరాడు.

"ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనాతో పోరాడటం గురించి మీ అందరికీ ఈ ఆరు విలువైన నియమాలను పాటించమని కోరుతున్నా" అంటూ కొన్ని సూచనలు చేశాడు. వదంతులను కాకుండా సరైన మాధ్యమాల నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలన్నాడు.

  1. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో ఉండటమే ఉత్తమం. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు.
  2. ఏదైనా తాకిన తర్వాత కనీసం 20 నుంచి 30 సెకన్లు మీ చేతులను కడుక్కోవాలని గుర్తుంచుకోండి.
  3. మీ ముఖాన్ని.. ముఖ్యంగా కళ్లు, నోరు, ముక్కును తాకకుండా ఉండండి.
  4. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు మీ మోచేతులు, టిష్యూ పేపర్లను వాడండి.
  5. సామాజిక దూరం- అవసరాన్ని బట్టి మీ ఇంట్లో వ్యక్తులకు, బయటి వారికి కనీసం 3 మీటర్ల దూరం ఉండేలా చూసుకోండి.
  6. మీకు కరోనా లక్షణాలు.. అనారోగ్యం ఉన్నట్లయితే మాత్రమే మాస్కును వాడండి. అలాంటి లక్షణాలేవైనా ఉంటే తప్పనిసరిగా వైద్యుడ్ని సంప్రదించండి.

ఇదీ చదవండి:'ఈ 21 రోజుల్ని పక్కాగా వాడుకుంటా'

ABOUT THE AUTHOR

...view details