తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సమంతతో రొమాంటిక్ సీన్స్​ కట్​.. కారణం అదే' - ది ఫ్యామిలీ మ్యాన్​

'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్​కు సంబంధించి ఆసక్తికర విషయాన్ని మీడియాకు వివరించాడు నటుడు షాదాబ్ అలీ. తనకు, సమంతకు మధ్య చిత్రీకరించిన కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను ఎడిటింగ్​లో తొలగించారని పేర్కొన్నాడు. నిడివి ఎక్కువగా ఉన్న కారణంగా కొన్ని సన్నివేశాలపై కత్తెర పడిందన్నాడు.

samantha and shadab
సమంత, షాదాబ్

By

Published : Jun 25, 2021, 1:08 PM IST

'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్​ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ఇటీవలే విడుదలైన ఈ సిరీస్​లో సమంత పాత్రకు ప్రశంసలు దక్కాయి. అయితే ఈ ఇందులో తనకు, సామ్కు​ మధ్య నడిచిన శృంగార సన్నివేశాలను తొలగించినట్లు నటుడు షాదాబ్ అలీ తెలిపాడు. నిడివి ఎక్కువగా ఉన్న కారణంగా రొమాంటిక్ సన్నివేశాలపైనా కత్తెర పడిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్​లో సమంత

ఎన్నో వివాదాల నడుమ ఓటీటీలో విడుదలైన ఫేమస్ వెబ్​సిరీస్​ 'ది ఫ్యామిలీ మ్యాన్​ 2' ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ప్రఖ్యాత ఐఎమ్​డీబీ టీవీ సిరీస్​ ర్యాంకింగ్స్​లో ఈ సిరీస్​కు నాలుగో స్థానం దక్కింది. 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్‌ 2'ను దర్శకద్వయం రాజ్‌, డీకే తెరకెక్కించారు. ఈ సిరీస్​లో తమిళ ఈలం సోల్జర్​ రాజీగా నటించి మెప్పించింది సామ్.

ఇదీ చదవండి:MAA Election: అందుకోసమే 'మా' ఎన్నికల్లో పోటీ

ABOUT THE AUTHOR

...view details