సినిమాల్లో కొన్ని పాత్రలు కనిపించేది కొద్దిసేపే అయినా చక్కటి ప్రభావాన్ని చూపుతాయి. ఒక కథానాయకుడిగా సినిమాలో వేరే హీరోలు అతిథి పాత్రల్లో తళుక్కున మెరుస్తుంటారు. అలాగే ఇంకొన్ని సినిమాల్లో పాత్రలు కథను కీలక మలుపు తిప్పుతాయి. అలాంటి పాత్రే 'చెల్లమ్ సర్'. ఇటీవల విడుదలైన 'ఫ్యామిలీ మ్యాన్2'లో ఈ పాత్రకు సూపర్ క్రేజ్ వచ్చింది. ఆ పాత్ర ద్వారానే కథ మలుపు తిరుగుతుంది. తమిళ నటుడు ఉదయ్ మహేశ్ ‘చెల్లమ్ సర్’ పాత్రలో కనిపించి అలరించారు.
Chellam Sir: 'కరోనా సీక్రెట్ తెలిసిన ఏకైక వ్యక్తి' - ఫ్యామిలీ మ్యాన్ 2 చెల్లమ్ సర్ మీమ్స్
సినిమాల్లో కనిపించే పాత్రలు కొద్దిసేపే అయినా ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. తాజాగా 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో చెల్లమ్ సర్ అనే పాత్రకు ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ సిరీస్‌లో ఆయన కనిపించేది 15 నిమిషాలే అయినా ప్రేక్షకులు ఎంతో ఇష్టపడిన క్యారెక్టర్ అది. ఈ పాత్రపై ఇప్పటికే చాలా మీమ్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి.
ఇంతకీ చెల్లమ్ సర్ ఎవరు? ఏం చేశారు?
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)లో పని చేసిన పదవీ విరమణ పొందిన వ్యక్తి చెల్లమ్. అంతేకాదు, ఒకప్పుడు ఏజెంట్ కూడా. శ్రీలంక సివిల్‌వార్ సందర్భంగా విశేష సేవలందించాడు. తమిళ రెబల్స్ నాయకుడు భాస్కరన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి. రా చీఫ్ శర్మకు మెంటార్. చెన్నైలో తమిళ రెబల్స్ నాయకుడి తమ్ముడు సుబ్బును పట్టుకునేందుకు పోలీసులు, టాస్క్(థ్రెట్ అనాలసిస్ అండ్ సర్వైవలెన్స్) రంగంలోకి దిగుతుంది. ఓ హోటల్‌లో దాక్కున్న అతను తప్పించుకుని మరో గదిలో ఉన్న వారిని బందీలుగా చేసుకుంటాడు. అతని నుంచి వాళ్లను రక్షించడానికి శ్రీకాంత్ తివారి(మనోజ్ బాజ్‌పాయ్) చెల్లమ్‌తో మాట్లాడి, భాస్కరన్‌తో ఫోన్ చేయిస్తాడు. దీంతో పోలీసులు సుబ్బును సులభంగా పట్టుకుంటారు. అంతేకాదు, తమిళ రెబల్స్ చేస్తున్న కుట్రను తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన శ్రీకాంత్ తివారీ టీమ్‌కు అవసరమైనప్పుడల్లా చెల్లమ్ సహాయం చేస్తుంటాడు. సుమారు 7 గంటలు ఉన్న సిరీస్‌లో చెల్లమ్ పాత్ర మొత్తంగా కనిపించేది 15 నిమిషాలు మాత్రమే. కథను కీలక మలుపు తిప్పేది కూడా ఈ పాత్రే కావడం వల్ల చూసిన వాళ్లందరూ మనోజ్ బాజ్‌పాయ్, సమంతలతో పాటు, చెల్లమ్‌సర్ పాత్రను కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పాత్రకు సంబంధించి మీమ్స్ వైరల్ అవుతున్నాయి. 'చెల్లమ్ సర్.. నాకు గర్ల్‌ఫ్రెండ్ ఎప్పుడు దొరుకుతుంది', 'మనకు వికీపీడియా ఉన్నట్లే.. చెల్లమ్ సర్ ఉన్నారు', 'మన రియల్ గూగుల్ చెల్లమ్ సర్' వంటి మీమ్స్ ట్విట్టర్లో సందడి చేస్తున్నాయి.