ఇన్నాళ్లుగా టాలీవుడ్లో ఎలిజెబుల్ బ్యాచిలర్‌గా ఉన్న హీరోలు ప్రస్తుతం పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇటీవలే యువకథానాయకులు నితిన్, నిఖిల్‌లు బ్రహ్మచర్యానికి ఫుల్స్టాప్ పెట్టగా తాజాగా ఆ జాబితాలో హీరో దగ్గుబాటి రానా చేరారు. మిహీకా బజాజ్ తన ప్రేమకు అంగీకారం తెలిపిందని ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు రానా.
నిరాడంబరంగా రానా, మిహీకాల నిశ్చితార్థం - రానా
టాలీవుడ్ యువకథానాయకుడు రానా, మిహీకా బజాజ్‌ల నిశ్చితార్థం బుధవారం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు రానా. ఇరు కుటుంబాలు తప్ప బయట వ్యక్తులు ఎవరూ ఈ వేడుకకు హాజరు కాలేదని సమాచారం.
నిరాడంబరంగా రానా, మిహికా బజాజ్‌ల నిశ్చితార్ధం
వీరిద్దరి కుటుంబాలు అంగీకరించడం వల్ల బుధవారం నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకలో ఇరు కుటుంబాలు తప్ప బయట వ్యక్తులు ఎవరు హాజరు కాలేదని సమాచారం. దానికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో అభిమానులతో షేర్ చేసుకున్నారు రానా.
ఇదీ చూడండి..'పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తక్షణమే అనుమతి'
Last Updated : May 21, 2020, 1:33 PM IST