అనసూయ ప్రధానపాత్రలో నటించిన థ్రిల్లర్ 'థ్యాంక్యూ బ్రదర్'. రమేష్ రాపర్తి దర్శకత్వం వహించారు. అశ్విన్ విరాజ్ కీలకపాత్రలో నటించారు. మే 7న ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. సినిమా మేకింగ్ వీడియోను 'ఆహా' సంస్థ ఆదివారం విడుదల చేసింది. సినిమా క్లాప్ కొట్టిన దగ్గర నుంచి షూటింగ్ ఎలా చేశారు. చిత్రంలోని కీలక సన్నివేశాన్ని లిప్టులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని లాక్‌డౌన్‌లో ఎలా చిత్రీకరించారనే అనే విషయాలన్నింటిని ఈ మేకింగ్ వీడియోలో చూపించారు.
'థాంక్యూ బ్రదర్' మేకింగ్.. త్వరలో షూటింగ్కు నాగార్జున - నాగార్జున న్యూస్
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో థాంక్యూ బ్రదర్ మేకింగ్ వీడియో, నాగార్జున కొత్త సినిమా రెండో షెడ్యూల్ గురించిన సంగతులు ఉన్నాయి.
మూవీ న్యూస్
నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా రెండో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. జూన్ తొలి వారం నుంచి దానికి సంబంధించిన చిత్రీకరణ జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.