పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అంటే చాలా మందికి అభిమానం. వారిలో సినీ ప్రముఖులూ ఉన్నారు. సంగీత దర్శకుడు తమన్ ఈ జాబితాలోకే వస్తాడు. పవన్‌తో తొలిసారి పనిచేస్తున్న ఇతడు.. పవర్‌స్టార్ రీఎంట్రీ ఇస్తున్న 'వకీల్‌సాబ్'కు సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన మొదటి గీతం 'మగువా మగువా'.. అభిమానుల మదిని దోచేస్తుండగా, ఇప్పుడు మరో కొత్త వార్త ఆసక్తి కలిగిస్తోంది.
పవర్‌స్టార్ పవన్‌పై ప్రేమతో తమన్ స్పెషల్ సాంగ్! - tollywood news
ప్రముఖ హీరో పవన్‌కల్యాణ్‌పై ఉన్న అభిమానంతో తమన్, అతడి కోసం ఓ స్పెషల్ పాటను స్వరపరుస్తున్నాడట. త్వరలో దీనిని అభిమానులతో పంచుకోనున్నాడు.
పవన్‌కల్యాణ్ వకీల్‌సాబ్
ఈ సినిమా ఆల్బమ్‌లో ఉన్నవి కాకుండా పవన్ కోసం ప్రత్యేకంగా ఓ పాటను సిద్ధం చేస్తున్నాడట తమన్. దీనిని 'వకీల్‌సాబ్' విడుదల కంటే ముందే, త్వరలోనే ప్రేక్షకులతో పంచుకోనున్నాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వాటిపై త్వరలో స్పష్టత రానుంది.