నాని నటించిన ఓ సరికొత్త చిత్రం గురించి నెట్టింట్లో అసత్య ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రధాన పాత్ర పోషించిన 'శ్యామ్ సింగరాయ్' త్వరలో ఓటీటీలోనే విడుదల కానుందంటూ అందరూ చెప్పుకుంటున్నారు. ఈమేరకు ఓ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ చిత్రబృందానికి రూ.40 కోట్లు చెల్లించి విడుదల హక్కులు కొనుగోలు చేసిందని పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డీల్ నచ్చడం వల్ల నిర్మాతలు, నాని కూడా ఓటీటీ విడుదలకు సముఖంగా ఉన్నట్లు సమాచారం. కాగా, సదరు వార్తలపై తాజాగా చిత్రబృందం స్పందించింది. అవన్నీ అవాస్తవాలేనని.. 'శ్యామ్ సింగరాయ్' విడుదల విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వారు వివరించారు.
నాని సినిమాపై అసత్య ప్రచారం.. స్పందించిన టీమ్ - నాని శ్యామ్ సింగ రాయ్
శ్యామ్ సింగరాయ్ సినిమా ఓటీటీలో విడుదల అవుతోదంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది ఆ చిత్ర బృందం. సినిమా విడుదలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.
సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాహుల్ దర్శకత్వం వహించారు. ఇందులో నాని రింగుల జుట్టు, కోర మీసాలలతో విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి కథానాయికలు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మిక్కి జె.మేయర్ స్వరాలు అందిస్తున్నారు. మరోవైపు నాని కథానాయకుడిగా నటించిన 'టక్ జగదీశ్' సైతం ఓటీటీ విడుదలకే సిద్ధమైన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి :వైష్ణవ్‌తేజ్ 'కొండపొలం'.. సెట్లోకి ఆలియా ఎంట్రీ