తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గాలి జనార్థన్​రెడ్డి కుమారుడి సినీరంగ ప్రవేశం.. ఆది కొత్త సినిమా - ss rajamouli

Telugu New Movies: కొత్త సినిమా అప్​డేట్స్​ వచ్చేశాయి. ఇందులో గాలి జనార్థన్​రెడ్డి కుమారుడు కిరీటి.. ఆది సాయికుమార్​, రాజ్​తరుణ్​ కొత్త సినిమా కబుర్లు ఉన్నాయి.

movie unit
చిత్ర బృందం

By

Published : Mar 4, 2022, 8:48 PM IST

Telugu New Movies: మైనింగ్‌ కింగ్‌ గాలి జ‌నార్ద‌న్ రెడ్డి తనయుడు గాలి కిరీటి కన్నడ, తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయంగా కాబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు ఎస్​.ఎస్​ రాజమౌళి క్లాప్​కొట్టి షూటింగ్​ను ప్రారంభించాడు. ఈ చిత్ర షూటింగ్​ బెంగళూరులో లాంఛనంగా ప్రారంభమైంది. కిరీటికి సంబంధించిన పరిచయ వీడియోను లాంఛనంగా ఆవిష్కరించారు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కిరీటి సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా సీనియర్ కథానాయిక జెనీలియా కిరీటిలో సోదరి పాత్రలో నటిస్తోంది. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా... కె.కె.సెంథిల్ కుమార్ ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు. చక్కటి టీంతో కిరీటి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడని, అన్ని రకాలుగా శిక్షణ తీసుకొని వస్తున్న కిరీటి మంచి విజయం సాధించాలని రాజమౌళి ఆకాంక్షించారు.

చిత్ర బృందం
హీరోయిన్​ శ్రీలీలా
క్లాప్​ కొడుతున్న రాజమౌళి

ఫుల్​ కామెడీ ఎంటర్​టైనర్​గా 'స్టాండప్​ రాహుల్​'

యువ కథానాయకుడు రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం స్టాండప్ రాహుల్. శాంటో మోహన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా విడుదల చేశారు. ఈ నెల 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆద్యంతం వినోదాన్ని పంచుతూ సాగే స్టాండప్ రాహుల్... నేటి తరం యువతతోపాటు పెద్దలను కూడా ఆలోచింపజేస్తుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో మురళీశర్మ, ఇంద్రజ, దేవీప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు.

హీరో ఆది కొత్త సినిమా

యంగ్​ హీరో, సీనియర్​ నటుడు సాయికమార్ తనయుడు ఆది కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ లో ప్రొడక్షన్ 10 గా ఈ సినిమా రాబోతుంది. ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ఫణి కృష్ణ సిరికి తెరకెక్కించునున్నాడు. ఈ సినిమాకు ధ్రువన్ సంగీతం అందిస్తుండగా, కేకే రాధామోహన్ నిర్మిస్తున్నాడు.

ఆది కొత్త సినిమా పోస్టర్​

టైగర్​ 3 విడుదల తేదీ ఖరారు

బాలీవుడ్​ కండలవీరుడు సల్మాన్​ఖాన్​, కత్రినాకైఫ్​, జంటగా నటించనున్న కొత్త చిత్రం 'టైగర్​ 3' విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని రంజాన్​ కానుకగా ఎప్రిల్​ 21 2023లో విడుదల చేస్తున్నారు. 'టైగర్​'(Tiger Movie Franchise) సిరీస్​లో భాగంగా రూపొందుతోన్న ఈ సినిమాలో గత రెండు చిత్రాలకు మించిన యాక్షన్​ను జోడించనున్నట్లు తెలుస్తోంది. 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' సినిమాలకు కొనసాగింపుగా 'టైగర్ 3' చిత్రం వస్తుంది. యశ్‌రాజ్‌ ఫిల్మ్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మనీష్‌ శర్మ దర్శకుడిగా పనిచేస్తున్నారు.

ఇదీ చదవండి:ఇక్కడ సూపర్​ హిట్​.. మరి అక్కడో..?

ABOUT THE AUTHOR

...view details