తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Cinema news: వరుణ్​తేజ్ 'గని' ఏంథమ్.. 'తడప్' ట్రైలర్ - బీద్ మూవీ

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో గని, తడప్, తెలంగాణ దేవుడు, బీద్, వరుడు కావలెను చిత్ర విశేషాలు ఉన్నాయి.

Cinema news
సినిమా న్యూస్

By

Published : Oct 27, 2021, 2:06 PM IST

*మెగాహీరో వరుణ్​తేజ్ కొత్త సినిమా 'గని'(ghani movie varun tej). ఈ సినిమాలోని తొలిపాట 'గని ఏంథమ్'ను బుధవారం రిలీజ్ చేశారు. ఇందులో వరుణ్, బాక్సర్​గా కనిపించనున్నారు. డిసెంబరు 3న సినిమా థియేటర్లలోకి రానుంది. 'వరుడు కావలెను'(varudu kaavalenu release date) చిత్రంలోని 'వడ్డానం' వీడియో సాంగ్​ను కూడా బుధవారం విడుదల చేశారు. అక్టోబరు 29న ఈ సినిమా థియేటర్లలోకి తీసుకురానున్నారు.

*సునీల్ శెట్టి తనయుడు అహన్​శెట్టి హీరోగా పరిచయమవుతున్న సినిమా 'తడప్'(tadap trailer). 'ఆర్​ఎక్స్ 100' రీమేక్​గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ట్రైలర్​ను బుధవారం విడుదల చేశారు. తారా సుతారియా(tara sutaria movies) హీరోయిన్. మిలాన్ లుథ్రియా దర్శకుడు. సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నారు. డిసెంబరు 3న థియేటర్లలోకి రానుంది.

*కేసీఆర్(kcr movie) జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'తెలంగాణ దేవుడు'. శ్రీకాంత్ టైటిల్​ రోల్​లో నటించారు. నవంబరు 12న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. వడత్యా హరీశ్ దర్శకత్వం వహించారు. మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్​.. మూలకథ అందించడం సహా నిర్మాతగా వ్యవహరించారు.

.

*రాజ్​కుమార్ రావ్, భూమి పెడ్నేకర్(bhumi pednekar movie) హీరోహీరోయిన్లుగా కొత్త సినిమాను ప్రకటించారు. 'బీద్' టైటిల్​తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అనుభవ్ సిన్హా దర్శకుడు. నవంబరు నుంచి షూటింగ్ మొదలుకానుందని అధికారికంగా వెల్లడించారు.

.
.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details