తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆటకైనా వేటకైనా 'చుల్​బుల్​ పాండే' రెడీ - ప్రభుదేవా

'దబాంగ్​3' తెలుగు మోషన్​ పోస్టర్​ను హీరో రామ్​చరణ్ బుధవారం విడుదల చేశాడు. సల్మాన్​ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

చుల్​బుల్​ పాండేగా సల్మాన్​ఖాన్

By

Published : Sep 11, 2019, 12:26 PM IST

Updated : Sep 30, 2019, 5:24 AM IST

'చుల్​బుల్​ పాండే'.. ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సరిగ్గా 100 రోజులు మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది 'దబాంగ్-3' చిత్రబృందం. హిందీలో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన మోషన్​ పోస్టర్​ను హీరో రామ్​చరణ్ తన ఫేస్​బుక్​లో పంచుకున్నాడు.

హీరో రామ్​చరణ్ ఫేస్​బుక్ పోస్ట్

హాస్యభరిత పోలీసు పాత్రలో మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నాడు హీరో సల్మాన్​ఖాన్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం. సోనాక్షి సిన్హా హీరోయిన్​గా నటిస్తోంది. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. తొలి రెండు భాగాలు అలరించిన నేపథ్యంలో మూడో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇది చదవండి: పాయల్.. ఏంటా హొయల్.. చూస్తే గుండె జిగేల్!

Last Updated : Sep 30, 2019, 5:24 AM IST

ABOUT THE AUTHOR

...view details